అనూష-కల్యాణ్ మధ్యలో ఇద్దరు లవర్స్.. ప్రేయసిపై కోపంతో ఆద్యపై కరుణాకర్ దాడి, మృతి..
ఆ చిట్టి తల్లి వయస్సు ఆరేళ్లు. మంచి, చెడు తెలియదు. కానీ ఆమెకు జీవం పోసిన తల్లి ప్రవర్తన ఆమె పాలిట శాపంగా మారింది. అర్ధాంతరంగా చిన్నారి ఆయువు తీరింది. తల్లి మరొకరితో చనువుగా ఉంటుందని మాజీ ప్రియుడు తెలుసుకున్నాడు. వారిద్దరినీ ఏదైనా చేయాలని భావించి.. సర్జికల్ కత్తి తీసుకొచ్చాడు. కానీ అక్కడ సీన్ మారింది. ప్రియురాలు-ప్రియుడు తప్పించుకోగా.. చిన్నారి మాత్రం దొరికిపోయింది. ఆ సైకోకు చిక్కి ప్రాణాలను వొదిలింది.

అనూష-కల్యాణ్ మధ్యలో కరుణాకర్
మేడ్చల్ జిల్లా పోచారంలో గురువారం జరిగిన ఘటన కలకలం రేపింది. ఇస్మాయిల్‌గూడలో విహార్ హోమ్స్ అనూష-కల్యాణ్ దంపతులు ఉంటున్నారు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహాం కాగా.. ఆరేళ్ల కూతురు ఆద్య ఉంది. కల్యాణ్ కూడా సమీపంలోనే పనిచేస్తుంటారు. కానీ అనూష తీరు సరిగా లేదు. సోషల్ మీడియా.. ఫేస్‌బుక్‌లో కరుణాకర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అలా వారిద్దరికీ వివాహేతర సంబంధం కూడా ఏర్పడింది. అయితే కరుణాకర్ స్నేహితుడు రమేశ్ కూడా అనూషతో పరిచయం ఏర్పడింది. అతను కూడా అనూషతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

కరుణాకర్ కట్
అనూష తీరు గురించి ఇరుగుపొరుగు వారు చెప్పడంతో.. భర్త కల్యాణ్ మందలించాడు. దీంతో ఆమె కరుణాకర్‌ను పక్కనపెట్టింది. దీంతో అతను రగిలిపోయాడు. కానీ రమేశ్‌తో వివాహేతర సంబంధాన్ని కంటిన్యూ చేస్తోంది. ఈ విషయం ఎలాగోలా కరుణాకర్ తెలుసుకున్నాడు. వారిద్దరినీ ఏమైనా చేద్దాం అని గురువారం వచ్చాడు. అయితే కరుణాకర్ రాకను గమనించిన అనూష.. రమేష్‌ను బాత్రూంలో దాచింది. ఇంట్లోకి వచ్చిన కరుణాకర్.. బయటకు రావాలని కోరాడు. ఎంతకీ రాకపోవడంతో పాప గొంతుపై కత్తిపెట్టాడు.

రమేశ్ ఎంట్రీ
పాప మెడపై కత్తితో దాడిచేశాడు. ఆద్య అరవడంతో రమేశ్ బయటకు వచ్చాడు. కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా రమేశ్ పరుగు తీశాడు. తర్వాత తన గొంతు కూడా కోసుకున్నాడు. మెడపై గాయం కావడంతో అతనిని పోలీసులు ఉప్పల్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి తండ్రికి ఘట్ కేసర్ పోలీసులు సమాచారం ఇచ్చారు.
Recommended Video

అనూష వల్లే
భర్త, కూతురితో హాయిగా ఉండాల్సిన అనూష.. ఫేస్‌బుక్ పరిచయాలు, ప్రేమ పేరుతో తన కూతురి హత్యకు కారణమైంది. కరుణాకర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొని, పుల్ స్టాప్ పెట్టేవరకు ఓకే.. కానీ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసిన కరుణాకర్ దాడి చేసి.. చంపేద్దామని అనుకొన్నాడు. కానీ వారి కోపానికి చిన్నారి బలయిపోయింది. ఆ తండ్రికి పేగుతెంచుకొని పుట్టిన బిడ్డ దూరమైపోయింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications