కేసీఆర్‌ను కలిసిన మోత్కుపల్లి: విషయమేంటా? అని షాకయ్యారు!..
మోత్కుపల్లి కేసీఆర్ తో భేటీ అయ్యారు అనగానే.. చాలామంది ఆశ్చర్యపోవడం ఖాయం. అయితే రాజకీయాలను పక్కనబెట్టి, తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి మోత్కుపల్లి కేసీఆర్ వద్దకు వెళ్లారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పేరెత్తితే చాలు.. అంతెత్తున లేచే టీ-టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తాజాగా ఆయనతో భేటీ అవడం హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయంగా.. సందర్బం వచ్చిన ప్రతీసారి కేసీఆర్ పై మోత్కుపల్లి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు.
అలాంటి మోత్కుపల్లి కేసీఆర్ తో భేటీ అయ్యారు అనగానే.. చాలామంది ఆశ్చర్యపోవడం ఖాయం. అయితే రాజకీయాలను పక్కనబెట్టి, తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి మోత్కుపల్లి కేసీఆర్ వద్దకు వెళ్లారు. మోత్కుపల్లి కేసీఆర్ వద్దకు రాగానే.. ఆయన్ను అక్కడ చూసినవారంతా షాక్ తిన్నట్లుగా తెలుస్తోంది.

తీరా అసలు విషయం తెలిసిన తర్వాత.. 'ఎంతైనా ఇద్దరూ ఒకప్పటి మిత్రులే కదా!' అంటూ నవ్వుకున్నారట. తన కుమార్తె పెళ్లికి రావాల్సిందిగా కేసీఆర్ ను కోరిన మోత్కుపల్లి.. ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఏదేమైనా రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండవచ్చు గానీ వ్యక్తిగత విషయాల్లో చాలామంది నేతలు ఎలాంటి భేషజాలకు పోకపోవడం చాలాసార్లు మనం గమనిస్తూనే ఉన్నాం.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications