గొల్లాఘాట్ శివారులో పులుల సంచారం: నాలుగు గుంపుగా (వీడియో)

ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి పులుల సంచారం కలకలం రేపుతోంది. భీంపూర్ మండలంలోని గొల్లఘాట్ శివారులో పులులు కనిపించాయి.

ఆదిలాబాద్: జిల్లాలో మరోసారి పులుల సంచారం కలకలం రేపుతోంది. భీంపూర్ మండలంలోని గొల్లఘాట్ శివారులో పులులు కనిపించాయి. గురువారం రాత్రి నాలుగు పులులు రోడ్డు దాటుతూ కనిపించాయి. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి పులులు రోడ్డు దాటడం చూసి.. వెంటనే తన ఫోన్లో వీడియో తీశాడు. ప్రస్తుతం పులులు సంచరిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

పిప్పల్ కోటి రిజర్వాయర్ పనుల కోసం ఓ డ్రైవర్ మట్టి తరలిస్తుండగా.. గొల్లఘాట్ వద్దకు రాగానే.. నాలుగు పులులు రోడ్డుతూ కనిపించాయి. వెంటనే తన ఫోన్లో ఆ దృశ్యాలను బంధించాడు. వాహనం వెలుగులో ఆ పులులు రోడ్డు దాటుతూ కనిపించాయి. వెంటనే బ్యారేజీ పనుల పర్యవేక్షణ అధికారికి సమాచారం అందించాడు.

movement of tigers in adilabad district: video viral

ఈ సమాచారం అందుకున్న సదరు అధికారి అటవీ శాఖ అధికారులకు విషయం చెప్పాడు. పులులు సంచరిస్తున్న విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు.. అక్కడికి వచ్చి పులుల అడుగులను పరిశీలించారు. పులుల సంచారం నిజమేనని తేల్చారు. గొల్లఘాట్ గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు రాత్రిపూట అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. పులులను పట్టుకునేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

గత కొంత కాలంగా ఆదిలాబాద్ జిల్లాలో పులులు సంచారంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం నాలుగు పులులు ఇక్కడ సంచరించాయి. ఇప్పుడు మరోసారి తాజాగా కనిపించాయి. తమ పశువులు, మనుషులపైనా దాడులు చేస్తాయని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా పులులను పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+