RGV: జీహెచ్ఎంసీపై మరోసారి ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో సంచలన పోస్టులు పెడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఓ చిన్నారి ఏదో వస్తువు పట్టుకుని వెళ్తోంది. అప్పుడే రెండు కుక్కలు ఆమెపై దాడి చేయడానికి యత్నించాయి. అమ్మాయి ప్రతిఘటించినా కుక్కలు మీదుకొచ్చాయి. ఇంతలో ఓ పెద్దాయన కుక్కలను కొట్టి బాలికను రక్షించాడు. ఈ వీడియోను రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ జీహెచ్ఎంసీ త్వరగా మేల్కొండి అని రాసుకొచ్చారు.

బాలుడిపై కుక్కలు దాడి

బాలుడిపై కుక్కలు దాడి

కొద్ది రోజుల క్రితం అంబర్ పేటలో బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన గంగాధర్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. నాలుగేళ్లుగా అంబర్ పేట ఛే నెంబర్ చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు భార్య జనప్రియ, ఆరేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వారు బాగ్ అంబర్ పేటలోని ఎరుకల బస్తీ ఉంటున్నారు. ఆదివారం పిల్లలకు సెలవు కావడంతో కుమార్తె, కొడుకు ప్రదీప్ ను తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్ కు తీసుకొచ్చాడు. బిడ్డను పార్కింగ్ వద్ద ఉన్న క్యాబిన్ లో ఉంచి.. కుమారుడిని లోపలికి తీసుకెళ్లాడు గంగాధర్. ఏదో పనిపై గంగాధర్ మరో వాచ్ మెన్ తో కలిసి బయటకు వెళ్లాడు. ప్రదీప్ కు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్లాడు.

ఆస్పత్రికి తరలింపు

ఆస్పత్రికి తరలింపు

ప్రదీప్ అక్కడే ఉండక.. పార్కింగ్ వద్ద ఉన్న అక్క వద్దకు బయల్దేరాడు. ఈ క్రమంలో బాలుడు నడిచి వస్తుండగా.. కుక్కలు మీదికి వచ్చాయి. ప్రదీప్ తప్పించుకునే ప్రయత్నం చేయగా.. కుక్కలు వదిలిపెట్టలేదు. ప్రదీప్ పై దాడి చేశాయి. అయితే ప్రదీప్ అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చి కుక్కలను వెళ్లగొట్టారు. వెంటనే అక్కడికి చేరుకున్న గంగాధర్ కుమారుడిని ఆస్పత్రికి తరలించాడు. కానీ ప్రదీప్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కుక్కలు తీవ్రంగా గాయపరచడంతో ప్రదీప్ ప్రాణాలు విడిచాడు. బాలుడిపై కుక్కలు దాడి చేసే ఘటన దృశ్యాలు అక్కడే సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

జీహెచ్ఎంసీ విఫలం

ఈ ఘటనపై కూడా రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. వీధి కుక్కల నియంత్రణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) విఫలమైందంటూ విమర్శించారు. కుక్కలకు ఆకలి వేయడం వల్లే చిన్నారిపై దాడి చేశాయి అని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇచ్చిన వివరణపై రాంగోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. గతంలో విజయలక్ష్మి తన పెంపుడు కుక్కతో కలిసి ఉన్న వీడియోను షేర్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+