కేసీఆర్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఏపీపైనా
భోపాల్/హైదరాబాద్: మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు జర్నలిస్టులతో తన నివాసంలో చిట్‌చాట్ నిర్వహించారు సీఎం చౌహాన్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి కేంద్రంగా మారిందని ఆరోపించారు.మధ్యప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదని దుయ్యబట్టారు.
తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టాలని ఎంపీ సీఎం చౌహాన్ సూచించారు. మధ్యప్రదేశ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ పోటీ చేస్తే తాము స్వాగతిస్తామని శివరాజ్ సింగ్ అన్నారు. తమ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు.. భారత్ రాష్ట్ర సమితితో సంప్రదింపులు జరుపుతున్నారని శివరాజ్ వెల్లడించారు. సంప్రదింపులు జరిపిన నాయకులందరూ.. బీజేపీ నుంచి టికెట్ రాదని ఆశలు వదులుకున్నవారేనని శివరాజ్ వివరించారు.

మరోవైపు, ఏపీ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఆ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. కార్యకర్తలకు వాలంటీర్ పోస్టులు ఇస్తే.. వారు పార్టీ కోసమే పని చేస్తారని.. ప్రజా సంక్షేమం కోసం పని చేయారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అందిస్తోన్న సామాజిక పింఛన్లు పారదర్శకంగా ఉంటేనే.. ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని శివరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు కూడా పాల్గొన్నారు.
జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మహారాష్ట్రలో పలుమార్లు పర్యటించారు. ఆ రాష్ట్రంలోని పలువురు నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. పలువురు నేతలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలపైనా కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ విమర్శలు ఎక్కుపెట్టారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications