దమ్ముంటే ఆ ఎంపీ ఎవరో చెప్పు కేటీఆర్.. డీకే అరుణ సవాల్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం తాలూకు రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాలలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కేటీఆర్ కు డీకే అరుణ సవాల్
ఒక బీజేపీ ఎంపీ కి కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే తాజాగా కేటీఆర్ చేసిన ఆరోపణల పైన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఎంపీ డీకే అరుణ కేటీఆర్ ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే ఆ బిజెపి ఎంపీ ఎవరో చెప్పాలని వారి పేరు వెల్లడించాలన్నారు.

గాలి మాటలు మాట్లాడొద్దు
కేటీఆర్ ఆ ఎంపీ ఎవరో చెప్పకుండా ఓ ఎంపీ అంటూ గాలి మాటలు మాట్లాడితే సరిపోదని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ఒకటేనని అందుకే తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నైలో నిర్వహించిన సమావేశానికి వెళ్లారని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ ఆయన కొడుకు ఉదయనిధి మాత్రమే అధికారంలో ఉండాలని అనుకుంటున్నారు అంటూ డీకే అరుణ విమర్శలు గుర్తించారు.
ఏపీలో మళ్ళీ ఎన్డీయే సర్కార్ నే
ఇక దక్షిణాది పైన బీజేపీ దృష్టి సారించిందని డీకే అరుణ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు గెలిచామని గుర్తు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉందని, ఏపీలో మళ్లీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి స్వతంత్రంగా అధికారంలోకి రాబోతుందని డీకే అరుణ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో విజయ కేతనం ఎగుర వేసేది బిజెపి నేనని డీకే అరుణ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications