థాంక్యూ సూపర్‌స్టార్: మహేష్ బాబు వీడియోను ట్వీట్ చేసిన కవిత
Recommended Video

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వీడియోను షేర్ చేశారు టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఆ వివరాల్లోకి వెళితే.. రక్షా బంధన్‌కు హెల్మెట్‌ను కానుకగా ఇవ్వండి అంటూ టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత గత ఏడాది ఓ క్యాంపైన్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

ఈసారి మహేష్
అది అప్పుడు చాలా పాపులర్ అయి రాఖీ సందర్భంగా తమ అన్న, తమ్ముళ్లకు హెల్మెట్లను కానుకగా ఇచ్చారు. తాజాగా ఈ క్యాంపైన్‌కు సూపర్‌స్టార్ మహేష్ బాబు తన వంతు సహాయాన్ని అందించారు.

మహేష్‌కు కవిత కృతజ్ఞతలు
నేడు(ఆగస్టు 9) ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా కవిత తన ట్విటర్ ఖాతాలో.. మహేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అంతేగాక, సిస్టర్స్ ఫర్ చేంజ్ క్యాంపైన్‌కు బాసటగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. మహేష్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు.

రోజూ 28మంది ప్రాణాలు కోల్పోతున్నారంటూ..
మన దేశంలో రోజూ జరిగే ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల 28 మంది చనిపోతున్నారని.. అంటే 28 కుటుంబాలు తమకిష్టమైన వ్యక్తిని కోల్పోతున్నాయని మహేష్ ఈ వీడియోలో ఆవేదన చెందారు.
కుటుంబాన్ని కాపాడినట్లే..
ఈ రాఖీ పండుగకు సిస్టర్స్.. తమ అన్నదమ్ముళ్లకు హెల్మెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి ధరించమని చెప్పాలంటూ మహేష్ కోరారు. ఒక ప్రాణాన్ని కాపాడితే ఒక కుటుంబాన్ని కాపాడినట్టే అని మహేష్ చెప్పిన వీడియోను పోస్ట్ చేశారు కవిత. ప్రస్తుతం ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications