నా పెళ్లికి రండి: రామ్మోహన్ నాయుడు ఆహ్వానం, గుర్తు చేసుకున్న కేసీఆర్
తన వివాహానికి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు శనివారం ఆహ్వానించారు.
హైదరాబాద్: తన వివాహానికి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు శనివారం ఆహ్వానించారు.
వధువు తండ్రి, విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తితో కలిసి శనివారం హైదరాబాద్‌లో కేసీఆర్‌కు శుభలేఖ అందించారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడితో తనకు ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అలాగే బండారు సత్యనారాయణ మూర్తితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్, బండారు రాష్ట్రంలో మంత్రులుగా పని చేశారు.












Click it and Unblock the Notifications