మిస్టర్ సంజయ్..ఒళ్లు దగ్గర పెట్టుకో -జగన్ తో చెప్పింది నిజం : ప్రతిపక్షం పాత్ర ఇస్తే పోషిస్తాం- కేసీఆర్..!!

బీజేపీ నేతలు...కేంద్ర ప్రభుత్వం పైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను హెచ్చరించారు. మిస్టర్ సంజయ్..ఒళ్లు దగ్గర పెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. తన ఫాం హౌస్ గురించి మాట్లాడుతున్నాడని..ఫాం హౌస్ లో కాలు పెడితే ఆరు ముక్కలవుతావని హెచ్చరించారు. అది ఫాం హౌస్ కాదని..ఫార్మ్ హౌస్ అని చెప్పుకొచ్చారు.

జగన్ తో జరిగిన చర్చల సమయంలో పెద్ద మనిషిగా రాయలసీమకు నీరు ఇవ్వాలని చెప్పిన మాట నిజమన్నారు. అధికారంలో శాశ్వతం కాదని.. ప్రజలు ప్రతిపక్షం పాత్ర ఇస్తే అదే పోషిస్తామని చెప్పారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒడ్లు కొనాలని ధర్నా చేయబోతున్నామని ప్రకటించారు.

జగన్ కు మంచి మనసుతో చెప్పాను

జగన్ కు మంచి మనసుతో చెప్పాను

గోదావరి నీటిని వాడుకోండి..మా సహకారం ఉంటుందని చెప్పానని గుర్తు చేసారు. బేసిన్లు- బేషజాలు వద్దని చెప్పానని కేసీఆర్ వెల్లడించారు. బీజేపీని వదలి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్రాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారి పైన దేశ ద్రోహి ముద్ర వేస్తారని..ఇది అలవాటుగా మారిందంటూ వ్యాఖ్యానించారు. తమను రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సాయం కోరిన సమయంలో తాము దేశ ద్రోహులం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలను ప్రశ్నిస్తే ఐటీ - ఈడీ దాడులు చేస్తారంటూ ఫైర్ అయ్యారు. ఈ బెదిరింపులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు.

దందాలు..మనీ లాండరింగ్ లు లేవు

దందాలు..మనీ లాండరింగ్ లు లేవు

తమకు దందాలు..మనీ లాండరింగ్ లు లేవని స్పష్టం చేసారు. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరని తేల్చేసారు. వాళ్లను..వీళ్లను బెదిరించినట్లుగా మా దగ్గర సాధ్యం కాదని స్పష్టం చేసారు. అన్నింటికి ఒకటే మంత్రం అయితే నడవదని..బూమ్ రాంగ్ అవుతుందని జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అనవసరపు ప్రయత్నాలు వద్దని హెచ్చరించారు. కరోనా సమయంలో ఎంతో మంది కూలీలు చనిపోయారని..తాము వారిని ఆదరించామని చెప్పుకొచ్చారు. దిక్కుమాలిన దందాలు చేసి పలు రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్నారని ఫైర్ అయ్యారు.

దళిత సీఎంను చేస్తానన్నాను..కానీ

2014 ఎన్నికల సమయంలో దళిత సీఎం ను చేస్తామని చెప్పిన మాట నిజమని..కానీ, కొన్ని కారణాల వలన చేయలేకపోయాని వివరించారు. కానీ, 2017లో తిరిగి ప్రజలు తమను ఆదరించారంటూ గుర్తు చేసారు. కేంద్రం వసూలు చేస్తున్న సెస్ పూర్తిగా ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేసారు. తాము ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారుతున్నామని చెప్పే చేసామని వెల్లడించారు. ఇతర పార్టీల్లో ఉంటే తీసుకుంటాం..వారి సేవలు తెలంగాణ కోసం వినియోగించుకుంటామని తేల్చి చెప్పారు.

ఏపీకి వెళ్లి చేపల పులుసు తిన్నా..తప్పేంది

ఏపీకి వెళ్లి చేపల పులుసు తిన్నా..తప్పేంది

బీజేపీ మధ్యప్రదేశ్ లో జ్యోతిరాధిత్య సింధియాను ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. ఏపీకి వెళ్లిన సమయంలో చేపల పులుసు తిన్నానని..అందులో తప్పేంటని ప్రశ్నించారు. మేఘాలయ గవర్నర్ సైతం రైతులకు మద్దతు తెలిపారని గుర్తు చేసారు. తెలంగాణకు తాను ఏం చేసిందీ కేంద్ర మంత్రులే చెప్పారని గుర్తు చేసారు. ఏ రంగంలో అయినా బీజేపీ పాలిత రాష్ట్రం తెలంగాణతో పోటీ పడిందా అని ప్రశ్నించారు. అంతర్జాతీయ మార్కెట్ లో 105 .. ఇప్పుడు 83 డాలర్లు ఉండగా... అబద్దాలు ప్రచారం చేసారంటూ కేసీఆర్ మండి పడ్డారు.

త్వరలో మరో 70 వేలకు పైగా ఉద్యోగాలు

త్వరలో మరో 70 వేలకు పైగా ఉద్యోగాలు

వరి సాగు ఎక్కడ ఉందో... 6 హెలికాప్టర్లు పెట్టి 62 ఎకరాలు చూపిస్తానంటూ చెప్పారు. సంజయ్ మాత్రమే కాదని.. నీ వెంట కేంద్ర మంత్రిని తెచ్చుకో అంటూ కేసీఆర్ సూచించారు. ఎన్నో ఎన్నికల్లో గెలిచాము.. ఓడితే గంభీరంగా అంగీకరించామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. గొర్లె పైసలు కేంద్రమే ఇచ్చి ఉంటే ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తానంటూ కేసీఆర్ సవాల్ చేసారు. తెలంగాణకు ఏం చేసావో చెప్పు అంటూ కేసీఆర్ డిమాండ్ చేసారు. లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. ఇంకో 78 వేల ఉద్యోగాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ వడ్లను కేంద్రం కొంటుందా లేదా చెప్పండని సీఎం కేసీఆర్ డిమాండ్ చేసారు. దొంగ లెక్కలు చెప్పే అవసరం లేదని..ఎవరికీ భయపడమని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+