వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముళ్లబాటే!, తల్లిని చంపినవాళ్లకు బుద్ది చెప్పాలంటే: సీతక్క బహిరంగ లేఖ

దాన్ని బతికించడానికి నాశక్తి సరిపోకపోవచ్చు. కానీ, నా తల్లిని చంపాలనుకున్న వారికి బుద్ధి చెప్పాలంటే ఒక బలమైన వేదిక అవసరం.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Revanth Reddy : సీతక్క ట్విస్ట్: రేవంత్ సతీమణి ప్లాన్ | Oneindia Telugu

ములుగు: టీటీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి.. తనతో పాటు మరికొంతమంది కీలక నేతలను వెంటపెట్టుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో సీతక్క చేరిక చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.

నిజానికి రేవంత్ తో ఢిల్లీ వెళ్లడం పట్ల సీతక్క డైలామాలో పడ్డట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలో రేవంత్ సతీమణి నడిపిన రాయబారమే ఆమెను ఢిల్లీ విమానం ఎక్కించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాను పార్టీ వీడటం పట్ల విచారం వ్యక్తం చేస్తూ అందుకు గల కారణాలను వివరిస్తూ సీతక్క ఓ బహిరంగ లేఖ రాశారు.

ఒత్తిడికి లోనయ్యాను:

ఒత్తిడికి లోనయ్యాను:

ప్రాణప్రదంగా భావించే ములుగు నియోజకవర్గ ప్రజలకు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను తీసుకున్న నిర్ణయాన్ని వివరించాలనే ఈ లేఖను రాస్తున్నాను.

గత 15 రోజులుగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈసందర్భంలో నేను ఒత్తిడికి లోనయ్యాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నాను.

 గుండె నిబ్బరం కోల్పోయాను:

గుండె నిబ్బరం కోల్పోయాను:

కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీని వీడేందుకు నేనెంత గుండెనిబ్బరాన్ని కోల్పోయానో చెప్పలేను. అయినా ఈ కఠిన పరిస్థితిలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇది నేను వ్యక్తులకోసం కాదు.. వ్యవస్థ కోసం తీసుకున్న నిర్ణయం.

 వారికి బుద్ధి చెప్పాలంటే:

వారికి బుద్ధి చెప్పాలంటే:

ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది అణచివేతే. ప్రశ్నించే గొంతుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని భావించాను. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పురుడుపోసుకుంది. తెలంగాణలో అనేక మార్పులకు, అభివృద్ధికి కారణమైంది టీడీపీ. అంతటి ఘనమైన రాజకీయ పార్టీని పూర్తిగా చంపేయాలని కుట్రలు చేస్తున్నారు.

దాన్ని బతికించడానికి నాశక్తి సరిపోకపోవచ్చు. కానీ, నా తల్లిని చంపాలనుకున్న వారికి బుద్ధి చెప్పాలంటే ఒక బలమైన వేదిక అవసరం. నాకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆనవాళ్లు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న వారికి బుద్ధి చెప్పాలంటే నాకు ఇంతకంటే ఉత్తమ మార్గం కనిపించలేదు.

 నేను నడిచేది ముళ్లబాటే అయినా:

నేను నడిచేది ముళ్లబాటే అయినా:

టీఆర్‌ఎస్‌లోకి వెళ్తే మూటలు వస్తయన్నరు. కానీ, నాకు మూటలు కాదు.. ప్రజలకిచ్చిన మాటలు కావాలి. ములుగును జిల్లా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి, మంత్రి మాట తప్పారు. వారిని పొగడమంటారా..? ప్రజలను వంచిస్తున్న ప్రభుత్వాన్ని, మంత్రిని పొగడటం నావల్ల కాదు.

రాబోయే రోజుల్లో ఈ నియంతృత్వ ప్రభుత్వం నన్ను ఇబ్బందులకు గురిచేస్తుందని తెలుసు. నేను నడిచేది ముళ్లబాటే అయినా నన్ను నమ్ముకున్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాను. అందుకే మీరంతా నన్ను ఆశీర్వదించి.. మడమ తిప్పని పోరాటంలో నాతోపాటు నడుస్తారని, అండదండలు అందిస్తారని ఆశిస్తున్నాను.

English summary
Mulugu Ex-MLA Seethakka resigned to Telugu Desam Party. She joined in the Congress Party in the presence of AICC Vice President Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X