మునావర్ షో టెన్షన్ - పోలీసుల ఆంక్షలు : బీజేపీ నేతల వార్నింగ్ - మరి కాసేపట్లో..!!

హైదరాబాద్ కేంద్రంగా మునావర్ ఫరూకి షో ఇప్పుడు టెన్షన పెంచుతోంది. ఈ షో కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు వార్నింగ్ లు ఇస్తున్నారు. నిర్వహించేందుకు వీలుగా పోలసులు అనుమతి ఇచ్చారు. ఈ సాయంత్రం 5 గంటలకు షో ప్రారంభం కానుంది. దీంతో..షో కు హాజరయ్యే వారికి పోలీసులు ఆంక్షలు విధించారు. షో జరిగి ప్రాంతంతో పాటుగా పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. ముందుగా సాయంత్రం 6.30 గంటలకు ఈ షో ప్రారంభం కావాల్సి ఉంది.

సస్పెన్స్ ..ఆందోళన

సస్పెన్స్ ..ఆందోళన


అయితే, నాటకీయ పరిణామాల మధ్య షో సమయాన్ని మార్పు చేసారు. షోకి వచ్చేవాళ్లు టికెట్ తో పాటు ఆధార్ కార్డు ని కూడా తీసుకొని రావాలని నిర్దేశించారు. లోపలికి ఎలాంటి ఫుడ్డు, వాటర్ బాటిల్స్ మొబైల్ పోన్లను అనుమతించరని స్పష్టం చేసారు. ఈ రోజుకు షో కు సంబంధించి పోలీసులు అనుమతి ఇఛ్చిన తరువాత బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. హిందూ దేవతల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మునాపర్ షో ను జరగనీయమని తేల్చి చెప్పారు. ఆయన షో ను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

భారీ భద్రతా ఏర్పాట్లు

భారీ భద్రతా ఏర్పాట్లు


దీంతో..పాటుగా ఈ ఉదయం నుంచి అసలు ఈ షో జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగింది. జ్వరం కారణంగా శుక్రవారం బెంగళూరులో జరగాల్సిన షో రద్దు చేసుకున్నారు. హైదరాబాద్ లో షో గురించి ఈ మధ్నాహ్నం ఇన్ స్టా ద్వారా వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. కానీ, ఇన స్టా ముందుకు రాలేదు. మరో వైపు ఒక ప్రయివేటు బుకింగ్ సంస్థ ద్వారా ఈ షోకు సంబంధించి పెద్ద సంఖ్యలో టిక్కెట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శిల్పకళావేదిక లో ఏర్పాట్లు పూర్తి చేసారు. దాదాపు రెండు వేలకు పైగా టికెట్స్ అమ్మకం జరిగినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్

ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్


దీంతో..కార్యక్రమం జరిగే ప్రాంతం మొత్తం పోలీసుల దిగ్బంధనం లో ఉంది. ప్రతీ ఒక్కరినీ జాగ్రత్తగా పరిశీలించిన తరువాత మాత్రమే అనుమతి ఇస్తున్నారు. తాము ప్రభుత్వానికి..పోలీసుల వినతి చేసినా..షో కు ఎలా అనుమతి ఇస్తారంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. షో నిర్వహించుకొనే హక్కు ఉంటుందని..దీనిని అడ్డుకుంటామని చెప్పటం సరి కాదని పోలీసులు అంటున్నారు. ఈ క్రమంలో మునావర్ షో సమయం సమీపించింది. దీంతో.. షో సమయంలో ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయా.. ప్రశాంతంగా ముగుస్తుందా అనేది ఉత్కంఠగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+