ఫలితాల వేళ బిగ్ ట్విస్ట్, రంగంలోకి కీలక నేతలు - సీన్ ఛేంజ్..!!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. అధికార కాంగ్రెస్ ఏకపక్షంగా విజయం సాధిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్, బీజేపీకి నామమాత్రంగా మున్సిపాల్టీలు దక్కుతున్నాయి. ఒక కార్పోరేషన్ బీజేపీ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. కొన్ని కార్పోరేషన్ల ఫలితాలు హోరా హోరీగా మారాయి. దీంతో.. ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ప్రతీ క్షణం ఉత్కంఠగా మారుతోంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు విజయం సాధించింది. మెదక్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ కు ఏకపక్ష ఫలితాలు కనిపిస్తున్నాయి. 90 మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. బీఆర్ఎస్ కేవలం 12, బీజేపీకి ఒక్క మున్సిపాల్టీకి పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏడు కార్పోరేషన్లలో 5 కాంగ్రెస్ గెలుస్తుండగా.. బీజేపీ ఒక స్థానం, ఇతరులు మరో స్థానం దక్కించుకుంటున్నట్లు ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ కు ఒక్క కార్పోరేషన్ కూడా దక్కకపోవటం ఆ పార్టీ నేతలకు అంతు చిక్కటం లేదు. పలు చోట్ల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇక.. మరో 12 మున్సిపాల్టీ ల్లో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్ అఫిషియో సభ్యులు కీలకం కానున్నారు.

హంగ్ మున్సిపాల్టీల్లో కీలకంగా మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలు
హంగ్ ఏర్పడిన స్థానాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు కీలకం కానున్నారు. గెలిచిన వార్డు సభ్యులను పార్టీలు క్యాంపులకు తరలిస్తున్నారు. కొన్ని మున్సిపాల్టీల్లో స్వతంత్ర అభ్యర్ధులు కీలకంగా మారుతున్నారు. వారిని తమ వైపు తిప్పుకునేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పరకాల మున్సిపాలిటీ, అలంపూర్, నర్సాపూర్, సంగారెడ్డి లో జిన్నారం, కేసముద్రం, ఇస్నాపూర్, ఆసిఫాబాద్, జమ్మికుంట, జనగామ, కామారెడ్డి, అమరచింత మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు మెజార్టీ కాంగ్రెస్ నుంచే ఉన్నారు. అదే విధంగా ఎంపీలు బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఉన్నారు. దీంతో.. గెలిచిన ప్రతీ సభ్యుడు పార్టీలకు కీలకంగా మారుతున్నారు. బీజేపీ ఎంపీలు ఎక్స్ అఫీషియో ఓటింగ్ లో ఎవరికి మద్దతు ఇస్తారనేది ఆసక్తి పెంచుతోంది. తుది ఫలితాల తరువాత ఈ హంగ్ మున్సిపాల్టీల పైన ప్రధాన పార్టీల నేతలు ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే తుది ఫలితాలు వెల్లడి అవుతున్నాయి.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications