ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా.. కదలించిన పెన్షనర్ ఆవేదన - బ్యాలెట్ బాక్స్‌లో లేఖ..!!
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ ఒక లేఖ సంచలనంగా మారింది. ఓ పెన్షనర్ తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం న్యాయం చేయాలని కోరుతూ ఓ లేఖను బ్యాలెట్ బాక్స్‌లో వేసిన అంశాన్ని ఓట్ల లెక్కింపు అధికారులు గుర్తించారు. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా.. మా రిటైర్‌మెంట్స్ బెనిఫిట్స్ ఎక్కడా అంటూ అందులో పెన్షనర్ ప్రశ్నించారు. తనకు న్యాయంగా రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పటికీ అందలేదని వాపోయారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అధికారులు ఈ లేఖను రిటర్నింగ్ అధికారికి అందచేసారు.
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందించకుండా రేవంత్ సర్కార్ చేస్తున్న జాప్యంపై నిరసన తెలుపుతూ బ్యాలెట్ బాక్స్‌లో ఓ లెటర్ ప్రత్యక్షమైంది. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా.. మా రిటైర్‌మెంట్స్ బెనిఫిట్స్ ఎక్కడా అంటూ అందులో పెన్షనర్లు ప్రశ్నించారు. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలోని 47వ వార్డులో చోటుచేసుకుంది. ఓటింగ్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి తన ఓటుతో పాటు ఒక లేఖను కూడా బ్యాలెట్ బాక్స్‌లో వేయడం ఎన్నికల సిబ్బంది గుర్తించారు. 'ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా.. మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ.?' అని ఆ లేఖలో ప్రశ్నించారు. తన కు న్యాయంగా రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పటికీ అందలేదని.. సదరు వ్యక్తి లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేసినట్టు స్పష్టం అవుతోంది. తన ఉద్యోగ జీవితమంతా ప్రభుత్వానికి సేవలు అందించినప్పటికీ, రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ బకాయిలు, ఇతర ప్రయోజనాలు ఇంకా అందలేదని పేర్కొన్నారు.

లేఖలో పెన్షనర్ ఆవేదన.. సోషల్ మీడియాలో వైరల్
ఈ లేఖ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసిన పెన్షనర్ తాను ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. ఎన్నిసార్లు అధికారులను కలిసినా.. సరైన స్పందన రాలేదని, ఫిర్యాదులు చేసినా పరిష్కారం కాలేదని లేఖలో పేర్కొన్నారు. తన సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించాలని, తనలాంటి వారు ఎందరో పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం బయటకు రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రక్రియలో ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని ..అయితే, పెన్షనర్ ఆవేదన చూసిన వారికి ఆయన ఇబ్బందులు ఏంటో అర్దం అయింది. తన సమస్య వ్యక్తిగతమైనదే అయినప్పటికీ, వేలాది మంది ఉద్యోగ విరమణ చేసినవారికి ఇదే పరిస్థితి ఉందని లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ లేఖ బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా, మరికొందరు పెన్షనర్ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications