ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో మున్సిపోల్స్ రిజల్ట్స్.. కేసీఆర్, కేటీఆర్‌కు హరీశ్ అభినందనలు
మున్సిపోల్స్‌లో టీఆర్ఎస్ విజయంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపించారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ, కార్సొరేషన్లలో ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో ఫలితాలు సాధించిన ప్రతీ ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.

బంగారు తెలంగాణ
బంగారు తెలంగాణ సాధన సీఎం కేసీఆర్ సారథ్యంలోనే సాధ్యమవుతోందన్నారు. టీఆర్ఎస్ నేతృత్వంలోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని భావించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ పార్టీదేనని మరోసారి రుజువు చేశారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనంతో మరోసారి ప్రూవ్ అయ్యిందన్నారు.

అభినందనలు
మున్సిపోల్స్‌లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించినందున సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలియజేశారు. పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను కూడా మంత్రి హరీశ్ రావు విష్ చేశారు.

టాప్ గేరులో కారు
మున్సిపోల్స్‌లో టీఆర్ఎస్ కారు టాప్ గేరులో దూసుకెళ్తోంది. కారు స్పీడుకు విపక్షాలు చెదిరిపోయాయి. మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీ కాస్త కనిపించినా.. కార్పొరేషన్లలో వాటి జాడే లేదు. స్థానిక సంస్థల్లో గులాబీ గుబాళించడంతో ఆ పార్టీ శ్రేణులు గులాల్ చల్లుకుంటూ ఆనంద డోలికల్లో మునిగితేలారు.












Click it and Unblock the Notifications