దిగొచ్చిన రేవంత్ - కోమటిరెడ్డికి బేషరతు క్షమాపణలు : మునుగోడు ఎఫెక్ట్..!!

టీపీసీసీ చీఫ్ రేవంత్ దిగొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ మేరకు క్షమాపణలు చెప్పారు. మునుగోడు ఎన్నికల వేళ.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో కీలకంగా మారారు. ఆయన సొంత పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఎన్నిక..రాజకీయంగా కోమటిరెడ్డి బ్రదర్స కు పట్టున్న ప్రాంతం కావటంతో ఇప్పుడు వెంకటరెడ్డి ఏం చేయబోతున్నారనే చర్చ రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది.

కోమటిరెడ్డి వ్యాఖ్యలతో...


రాజగోపాల్ రెడ్డి రాజీనామా - చండూరు సభలో పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. పార్టీని లీడ్ చేస్తున్న వ్యక్తులే తమను తిట్టించారని..తమను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మునుగోడు బై పోల్ పైన సమావేశాలు ఏర్పాటు చేసి..తనను ఆహ్వానించలేదని వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లిన మాణికం ఠాగూర్ తనను కలవకపోవటం.. కనీసం తనకు ఫోన్ చేయకపోవటం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తనను హోం గార్డుతో పోల్చటం పైన వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యల వెనుక పార్టీ పెద్దలు ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. తనకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని..తనను ఆహ్వానించే వరకూ మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లనని స్పష్టం చేసారు.

వెంకటరెడ్డికి రేవంత్ క్షమాపణలు

వెంకటరెడ్డికి రేవంత్ క్షమాపణలు


ఈ మొత్తం పరిణామాల పైన తాను నేరుగా సోనియా -రాహుల్ తో చర్చిస్తానని వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న తనకు సమాచారం లేకుండానే మునుగోడులో కార్యక్రమాలు ఫిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ఎన్నిక ఇప్పుడు కాంగ్రెస్ తో పాటుగా వ్యక్తిగతంగా రేవంత్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేసిన విధంగా క్షమాపణ చెబుతూ రేవంత్ వీడియో విడుదల చేసారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు మంచిది కాదని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యల ను తాను సమర్ధించనని స్పష్టం చేసారు. హోంగార్డు ప్రస్తావన చేసినందుకు క్షమాపణ అడుగుతున్నానని వివరించారు.

వెంకన్న ప్రచారంలోకి దిగుతారా

వెంకన్న ప్రచారంలోకి దిగుతారా


వెంకటరెడ్డి కోరిన విధంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు భేషరతుగా క్షమాపణలు చెప్పారు. దీంతో..కోమటిరెడ్డి వెంకట రెడ్డి శాంతిస్తారా ..ఆయన స్పందన ఏంటనేది చూడాల్సి ఉంది. అయితే ,కాంగ్రెస్ మునుగోడులో 175 గ్రామాల్లో పాదయాత్ర - పర్యటనల పైన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కానీ, కోమటిరెడ్డి నియోజకవర్గంలో పార్టీ తరపున ప్రచారం పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రేవంత్ క్షమాపణ ద్వారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఎన్నికల ప్రచారం లోకి దిగుతారా లేదా ఇంకా రేవంత్ లక్ష్యంగా తన పోరు కంటిన్యూ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+