నవంబర్ రెండో వారంలో మునుగోడు బై పోల్..? ఈసీ ఏర్పాట్లు

మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించాలని ప్రధాన పార్టీలు తహతహ లాడుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయకముందే ప్రచారం చేశాయి. ఇప్పుడు బై పోల్ తేదీ నిర్వహణపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. నవంబర్ రెండో వారంలో నిర్వహిస్తారని సమాచారం వస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. నవంబర్ రెండో వారంలో మునుగోడు ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది. దసరా తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అలాగే ఉప ఎన్నికకు ఈవీఎంతో పాటు అవసరమైన ఏర్పాట్లు ఈసీ చేస్తోంది.

munugodu by poll is comes november second week

పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు ఈసీఐ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. నల్గొండ జిల్లా కలెక్టర్, అధికారులు ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు. నవంబర్ రెండో వారంలో ఎన్నిక కండక్ట్ చేసి.. మరో 10 రోజుల్లో ఫలితాలను ప్రకటిస్తారు. దేశంలో మిగతాచోట్లతోపాటు.. ఇక్కడ కూడా ఎన్నికను నిర్వహిస్తారు.

బై పోల్‌ను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీకి జీవన్మరణ సమస్యగా మారింది. ఆ పార్టీ అగ్రనేతలను బరిలోకి దింపింది. అక్కడ గెలిస్తే.. రాష్ట్రంలో అధికార మార్పు అని బీజేపీ చెబుతుంది. టీఆర్ఎస్ పార్టీ కూడా విజయం సాధించాలని ఉవ్విళూరుతుంది. తమ పట్టు కోల్పోవద్దని అనుకుంటోంది. ఆ మేరకు బరిలోకి దిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+