టిఆర్ఎస్ నేత హత్యకు కుట్ర: ’మాజీ మంత్రి తమ్ముడి పనే’
హైదరాబాద్: నగరంలోని గౌలిగూడలో టిఆర్‌ఎస్ నేత ఆనంద్‌కుమార్‌గౌడ్ హత్యకు ముగ్గురు దుండగులు ఆయన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఆనంద్‌కుమార్‌గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అఫ్టల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మారణాయుధాలతో సంచరిస్తున్న ఈ ముగ్గురు వ్యక్తులను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి తల్వార్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ప్రాణభయం ఉంది: ఆనంద్ కుమార్ గౌడ్
సుపారీ తీసుకున్న కొందరు తనను హత్య చేసేందుకు వచ్చారని ఆనంద కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. అక్రమ దందాలను అడ్డుకున్నందుకే తన హత్యకు మాజీ మంత్రి తమ్ముడు, ఓ మాజీ కార్పొరేటర్ కుట్ర పన్నినట్లు చెప్పారు. వారితో తనకు ప్రాణభయం ఉందని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
నిందితుల నుంచి తల్వార్లను స్వాధీనం చేసుకుని, అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. హత్య కుట్ర వెనుక మాజీ మంత్రి తమ్ముడు, ఓ మాజీ కార్పొరేటర్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications