దారుణం: అత్తకి యముడు.. అమ్మాయికి మొగుడు !!

సమాజంలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు చూస్తుంటే.. మానవ సంబంధాలు పూర్తిగా కనుమరుగయ్యాయని అనిపిస్తుంది. ఏ మాయ రోగం వచ్చిందో తెలీదు కానీ మనుషులు మనుషులు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా పారు పాల్పడుతున్న కిరాతకపు ఘటనకు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. ఓ పక్క పెళ్లి అయిన వారు.. మరో పక్క పెళ్లి కాని వారు.. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా తమ భాగస్వామిని కడతేరుస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భార్యను కడతేర్చుతున్న మృగాళ్లు ఓ పక్కన ఉంటే.. మరోవైపు ఇప్పుడు కొత్తగా ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను వారినే కాటికి పంపుతున్నారు కొందరు మహిళలు. మరి కొంతమంది మృగాళ్లు అయితే వావివరసలు మర్చిపోయి కొంత మంది మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు . తల్లి, చెల్లి, వదిన అనే తేడాలేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు.

పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్న కొందరు మగాళ్లను చూస్తుంటే మహిళలకు అసలు రక్షణ ఉందా అనే అనుమానం సర్వత్రా అనుమానం కలిగిస్తుంది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ లో ఈ తరహా దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు బాగు కోసం కోసం అల్లుడుని ఇల్లరికం తెచ్చుకుంటే.. చివరకు ఆ కిరాతకుడు అత్తకి యముడిగా మారాడు. మద్యం మత్తులో ఆమెను అత్యాచారం చేయడమే కాకుండా తీవ్రంగా కొట్టి చంపిన ఘటన కలకలం రేపుతోంది.

murder-news-that-son-in-law-wife-killed-mother-in-law-after-physically-assaulting-her-in-nagar-kuroo

అసలేం జరిగిందంటే..

నాగర్‌ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన మహిళకు ఇద్దరు సంతానం. ఒక కూతురికి కొన్నేళ్ల క్రితం తిమ్మాజీపేట మండలానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిపించింది. అయితే కొన్నిరోజులు వారి కాపురం సజావుగానే సాగినా.. ఆ తర్వాత అల్లుడు తాగుడుకు బానిసగా మారడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఎలాంటి ఉద్యోగం లేకుండా రోజు తప్పతాగి కూతుర్ని వేధిస్తుండడంతో కూతురు బాగు కోసం అతడ్ని ఇల్లరికంగా తెచ్చుకుంది.

అయితే ఇటీవల భార్యభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరింది. ఇక భర్తను భరించలేని భార్య బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. అప్పటికే తప్పతాగి ఉన్న అల్లుడు.. అత్తను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎవరికైన చెబుతుందేమో అనే అనుమానంతో తీవ్రంగా కొట్టి, ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆ తర్వాత అక్కడి పారిపోయినట్టు సమాచారం.

స్థానికులు పెద్ద శబ్దాలను గమనించి ఇంటికి వెళ్లి చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి రెండో కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+