నయీం సినిమా: ఘాతుకంగా హత్య సీన్
నయీం సినిమా: ఘాతుకంగా హత్య సీన్
ఈ దృశ్యం చూసారా.. నడిరోడ్డు మీద నలుగురు వ్యక్తులు ఒక మనిషిని కిరాతంగా వేట కోడవళ్లతో నరకడం..దాన్ని ప్రజలు గుంపులు..గుంపులుగా చూడటం. ఇది ఎక్కడ జరిగిందనుకుంటున్నారా..! నల్గొండ జిల్లా కేంద్రంలో నడ్డిరోడ్డుపై ఈ దారుణం జరిగింది. ఈ మర్డర్ గతంలో పౌరహక్కుల నేత పురుషోత్తంను ఒక ముఠా సభ్యులు ఎలా చంపేసారో అలాగే ఈ మర్డర్ కూడా జరిగింది. కానీ ఇక్కడకు పోలీసులు రాలేదు. వారిపై పోలీసులు కేసు నమోదు చెయ్యలేదు..ఇంకా వారి మర్డర్ కార్యక్రమానికి పోలీసులే కాపలా కాసారంటే మీరు నమ్ముతారా..నమ్మాలి.. ఎందుకంటారా.. ఇది ఒక సినిమా షూటింగ్ కాబట్టి.. నిన్న ..మెన్న తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గ్యాంగ్ స్టర్ నయీం ఉదంతంపై ఒక సినమా షూట్ లో భాగాంగా ఈ సన్నివేశాన్ని చిత్ర దర్శకుడు తెరకెక్కించారు.












Click it and Unblock the Notifications