పూజిత:బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్‌పై ఆరా, ఫేస్‌బుక్‌కి లేఖ

హైదరాబాద్: పంజాగుట్ట ఐఏఎస్ క్వార్టర్ల సమీపంలో దహనమై కనిపించిన పూజిత కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. ఆమె మృతికి గల కారణాలను తేల్చే ఫోరెన్సిక్ నివేదిక రావడానికి కొంత సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పూజిత ఫేస్‌బుక్ ఖాతా పైన దృష్టి సారించారు.

కొంతకాలంగా ఆమె ఫేస్‌బుక్ ద్వారా జరిపిన చాటింగ్ వివరాలు తెలపాలని కోరుతూ ఫిన్‌లాండ్‌లోని ఫేస్‌బుక్ యాజమాన్యానికి పంజాగుట్ట పోలీసులు గురువారం నాడు లేఖ పంపించారు. అక్షయ్ కుమార్ అనే స్నేహితుడితో సన్నిహితంగా మెలిగిన నేపథ్యంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు గురించి తెలుసుకోనున్నారు.

 Mystery shrouds Nandigama woman's death in Hyderabad: Police writes letter to Facebook

కాగా, హైదరాబాదులోని పంజాగుట్టలో సజీవ దహనమైన మహిళను పూజితగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. పూజిత స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నందిగామ. పూజిత విజయవాడలో సీఏ చదువుతోంది. పూజిత తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆమెది ఆత్మహత్యనా, హత్యనా అనే విషయాన్ని తేల్చుకునే పనిలో వారు పడ్డారు. నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట కాలనీలోని ఐఏఎస్ క్వార్టర్స్ పార్కులో ఈమె శవం కనిపించింది. పంజాగుట్ట కాలనీ ఐఏఎస్ క్వార్టర్స్‌లోని జీహెచ్‌ఎంసీ పార్కులో గత శుక్రవారం ఉదయం పూర్తిగా కాలిపోయిన ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+