జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ చేతికి ఆనాటి రూ.3 కోట్లు, టైంకు ఇచ్చిన మెగా బ్రదర్?
Recommended Video

హైదరాబాద్/అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు పార్టీ కోసం ఎంతో కొంత డబ్బు సమయానికి వచ్చిందా? అంటే అవుననే అంటున్నారు. పార్టీ నడపాలంటే డబ్బు కావాలని, అది తన వద్ద లేదని పవన్ గతంలో ప్రకటించారు.
తాను సినిమాలు చేసి అలా వచ్చిన డబ్బు ద్వారా పార్టీకి ఖర్చు పెడతానని చెప్పారు. ఇటీవల వచ్చిన సినిమాల ద్వారా ఆయన చేతికి కొంత డబ్బు వచ్చి ఉంటుంది. అందుకే ఆయన పార్టీపై దృష్టి సారించారు.

2019కి సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్
2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే మిగిలి ఉంది. ఆయన అన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.

పవన్ కళ్యాణ్ చేతికి నాటి డబ్బు
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ చేతికి తాజాగా కొంత డబ్బు వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీకి నిధులు లేవని ఆవేదన చెందుతున్న పవన్ కళ్యాణ్‌కు ఎంతోకొంత ఊరటనిచ్చేది అని అంటున్నారు.

ఆరెంజ్ సినిమాతో చితికిపోయారు
పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఆరెంజ్ సినిమా తీసి బాగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఆరెంజ్ సినిమా వల్ల నాగబాబు ఆర్థికంగా చితికిపోయారు. ఆ సమయంలో సోదరులు ఆయనకు సాయం చేశారు. అప్పుడు పవన్ రూ.3 కోట్లు తన చిన్న అన్నయ్య నాగబాబుకు ఇచ్చారని చెబుతారు.

నాగబాబు, వరుణ్ తేజ బిజీ
తాజాగా, ఆ డబ్బును నాగబాబు తిరిగి తన తమ్ముడికి ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. నాగబాబు, తనయుడు వరుణ్ తేజ్‌లు టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే చిరంజీవి సూచన మేరకు మా నెట్ వర్క్‌లో కొంత పెట్టుబడి పెట్టారు.

పవన్ కళ్యాణ్‌కు తిరిగిచ్చిన నాగబాబు
ఇప్పుడు నాగబాబు ఆర్థికంగా బాగున్నారని, కాబట్టి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు డబ్బులు ఇచ్చేశారని అంటున్నారు. ప్రస్తుతం పవన్ జనసేనతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆ డబ్బు పవన్‌కు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. అయితే, నిత్యం ప్రజల కోసం ఆలోచించే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగితే ఎంతోమంది డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు.












Click it and Unblock the Notifications