పవన్ వస్తే వారి వేషాలు సాగవనే, ఒక్కొక్కడికి ఇక ఉంటదీ: నాగబాబు వార్నింగ్, రాధాకృష్ణకు షాక్!

హైదరాబాద్: తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కొందరు ఉద్దేశ్యపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని, వారి దుమ్ము దులిపేందుకు కళ్యాణ్ వస్తున్నాడని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య -నా ఇల్లు ఇండియా సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ అంటూ పవన్ అంశంపై స్పందించారు.

Recommended Video

    'బట్టలూడదీసి మాట్లాడుకుందాం - బట్టలూడదూసి కొడదాం ' :ఆర్. కే. పై పవన్ విజ్రుమ్భాన

    పవన్, చెర్రీ, బన్నీ ఇలా మెగా కుటుంబానికి మొత్తానికి చిరంజీవి దారి చూపించారని అందుకు అన్నయ్యకు థ్యాంక్స్ అన్నారు. నా తమ్ముడు పెద్ద హీరో, సినిమా ఇండస్ట్రీలో నెంబర్‌ వన్ పొజిషన్‌లో ఉండి కోట్ల రూపాయల సంపాదనను కూడా తృణప్రాయంగా వదిలేసి, నిస్వార్థంగా ప్రజల్లోకి వెళుతున్నాడని వ్యాఖ్యానించారు.

    మీ అందరి కోసం పవన్ కళ్యాణ్ వచ్చారు

    మీ అందరి కోసం పవన్ కళ్యాణ్ వచ్చారు

    ఒకే మాట చెబుతున్నాను.. కొందరు ఎన్నో కుతంత్రాలు, కుయుక్తులు చేస్తున్నారని, నీచమైన రాజకీయాలు మాపై చేస్తున్నారని, మేము సినిమా ఇండస్ట్రీలో ఉంటే మాత్రం ఎవ్వరూ ఏమనరని, అయినప్పటికీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని నాగబాబు అన్నారు. అన్ని అడ్డంకులను తొలగించుకుని పవన్ వచ్చాడని, మీ అందరి బాగు కోసం మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం తన భవిష్యత్తును వదిలేసుకుని మీ ముందుకు వచ్చాడని చెప్పారు.

    ఒక్కొక్కడికి ఇక ఉంటదీ!

    ఒక్కొక్కడికి ఇక ఉంటదీ!

    కొన్ని పార్టీలు రకరకాలగా కుటుంబాలను నోటికి వచ్చినట్లు తిట్టించి రాజకీయాలు చేస్తున్నాయని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరందరి దుమ్ము దులిపేస్తూ పవన్ కళ్యాణ్ వస్తున్నాడన్నారు. ఒక్కడే అనుకోకండి, అతడి వెనకాల చాలామంది ఉన్నారని చెప్పారు. ప్రజా జీవితంలోకి వచ్చి సేవ చేయాలనుకుంటున్నామని, ఒకసారి (ప్రజారాజ్యం) కుదర్లేదని, ఇప్పుడు కుదురుతుందని, ఒక్కొక్కడికి ఇక ఉంటదీ అని నాగబాబు ఆవేశంగా మాట్లాడారు.

     పవన్ రావొద్దని కోరుకునే వారు అలా చేస్తున్నారు

    పవన్ రావొద్దని కోరుకునే వారు అలా చేస్తున్నారు

    పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తును ప్రజల కోసం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారని నాగబాబు అభిప్రాయపడ్డారు. ఎవరైతే పవన్ రావొద్దని అనుకుంటున్నారో, ఏ పార్టీలైతే పవన్ రావొద్దనుకుంటున్నాయో.. తొక్కేసి, ఏమీ చేయలేక కుటుంబాలను నోటికి వచ్చినట్లు మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. వీళ్లందరి దుమ్ము దులిపేలా వస్తున్నాడన్నారు. పవన్ ఒక్కడు కాదని, అతని వెనుకాల చాలామంది ఉన్నారని తెలిపారు. తమకు స్కాములు అవసరం లేదన్నారు. నిస్వార్థంగా ప్రజా జీవితంలోకి వస్తున్నామని, ఎలా చేయాలో మాకు తెలుసునని, ఒకసారి కుదరలేదని ఈసారి కుదురుతుందన్నారు. ఎన్నో కుతంత్రాలు, ఎన్నో కుయుక్తులు, నీచమైన రాజకీయాలు మాపై చేస్తున్నారన్నారు.

    పవన్ కళ్యాణ్ లాంటి వాడు వస్తే వేషాలు సాగవని

    పవన్ కళ్యాణ్ లాంటి వాడు వస్తే వేషాలు సాగవని

    పవన్ కళ్యాణ్ లాంటి వాడు అన్నీ వదులుకొని, అన్ని అడ్డంకులు తొలగించుకొని మీ ముందుకు వచ్చాడని, అలాంటి వాడు వస్తే వారి వేషాలు సాగవని కొందరు కుట్రలు పన్నుతున్నారని నాగబాబు మండిపడ్డారు. వాళ్లందరి దుమ్ముదులిపేలా పవన్ రాబోతున్నాడన్నారు. డబ్బు సంపాదించడానికో, స్కాములో మాకు వద్దని, మీ రూపంలో (అభిమానులు) దేవుడు మాకిచ్చారన్నారు.

    పవన్ కళ్యాణ్ అన్నీ వదిలేసి వచ్చారు

    పవన్ కళ్యాణ్ అన్నీ వదిలేసి వచ్చారు

    పవన్ విషయమై అల్లు అర్జున్ కూడా స్పందించారు. పవన్ నెంబర్ వన్ హీరో అని, ఎన్నో కోట్ల రూపాయలు వస్తాయని, అతను హ్యాపీగా ఉండవచ్చునని, కెరీర్ అయిపోతూ కొంతమంది పాలిటిక్స్‌లోకి వస్తారని, పవన్ మాత్రం అన్నీ వదిలేసి వచ్చారని చెప్పారు.

    ట్వీట్‌లో ఆర్కే, టీడీపీని దులిపేసిన పవన్

    ట్వీట్‌లో ఆర్కే, టీడీపీని దులిపేసిన పవన్

    మరోవైపు, పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ఏబీఎన్ ఆర్కేను టార్గెట్ చేశారు. ఏబీఎన్ వాహనాలను ధ్వంసం చేసిన కేసులో పవన్ అభిమానులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. 'ఆర్కే, మీ దూషణలను మేము భరిస్తాం. వాటు టూ డూ? మేము సాత్వికం.. పైగా పవర్ లెస్. మేము బాధపడతాం' అని పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో.. 'టీడీపీ జ్యోతి రత్న, ఆర్కే.. టీడీపీ సంస్కృతి ఏంటి.. పీఎం నుంచి సాధారణ వ్యక్తి వరకూ ప్రతిఒక్కరిని దూషించడమా.. గుడ్ ట్రైనింగ్, కీపిటప్..' అని విమర్శించారు. ఇంకో ట్వీట్‌లో.. ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీ నేతలకు గొప్ప వ్యూహం ఉందని, అత్యంత అసభ్యకరమైన పదజాలంతో ప్రధానమంత్రిని తిట్టమని మీకు ఎవరు సలహా ఇచ్చారు? కచ్చితంగా, ఆ సలహా ఇచ్చింది ఆర్కేనే అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+