Naga Chaitanya: పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నాగచైతన్య సందడి(వీడియో)
హైదరాబాద్: టాలీవుడ్ హీరో నాగచైతన్య నగరంలోని యూసఫ్‌గూడలో సందడి చేశారు. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య నటించిన చిత్రం 'కస్టడీ'(Custody) మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రియల్ పోలీసులతో కలిసి యూసఫ్‌గూడ ట్రైనింగ్ అకాడమీలో సందడి చేశారు.
డ్యూటీలో పోలీసులు ఎదుర్కొనే సవాళ్ల గురించి నాగచైతన్య అడిగి తెలుసుకున్నారు. నిజమైన పోలీసులు చేసే ఫీట్లు చేసి అలరించారు. పలువురు పోలీసులు కూడా చైతన్యను పలు విషయాలు అడిగారు. కాగా, నాగ చైతన్య పోలీసు అధికారులతో ఇంటరాక్ట్ అయ్యారు.

నాన్‌స్టాప్‌గా 30 పుషప్‌లను చేయడం గమనార్హం. చైతన్య అంకితభావం, ఉత్సాహం పోలీసు అధికారులను ఆకట్టుకున్నాయి. నాగ చైతన్య తన స్టంట్స్‌తో మెప్పించడమే కాకుండా, పోలీసులతో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు హీరో నాగచైతన్య.
'కస్టడీ'లో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్‌గా నటిస్తుండగా, కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తుండగా.. ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుంది. నాగ చైతన్య తొలి భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది.












Click it and Unblock the Notifications