ప్రియుడి కోసం పిల్లలకు దూరంగా, సుధాకర్‌రెడ్డికి గాయమిలా, రాజేష్‌కు స్వాతి గిప్ట్‌లు
నాగర్‌కర్నూల్: వివాహేతర సంబంధం కోసం ప్రియుడు రాజేష్‌తో కలిసి భర్త సుధాకర్‌రెడ్డిని హత్య చేసిన స్వాతి ఎంతో పథకం ప్రకారం వ్యవహరించింది. రాజేష్‌తో వివాహేతర సంబంధానికి ఇబ్బంది రాకుండా ఉండేందుకు పిల్లలను కూడ దూరంగా ఉంచింది. ప్రాణంగా ప్రేమించి వివాహం చేసుకొన్న స్వాతి తీరుతో సుధాకర్‌రెడ్డి చనిపోవడానికి రెండు రోజుల ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
నాగర్‌కర్నూల్ పట్టణంలో క్రషర్ వ్యాపారం చేసే సుధాకర్‌రెడ్డిని ఆయన భార్య స్వాతి, ప్రియుడు రాజేష్‌తో కలిసి నవంబర్ 27వ,తేదిన చంపేశారు. అయితే భర్తను చంపేందుకు స్వాతి వ్యూహత్మకంగా వ్యవహరించింది.
అన్ని పథకం ప్రకారంగా జరిగితే సుధాకర్‌రెడ్డి స్థానంలో రాజేష్ ఉండేవాడు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత పూణెలో నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు.

రాజేష్ కోసం పిల్లలను తల్లి వద్ద వదిలిన స్వాతి
నాగర్ కర్నూల్‌లో పిజియోథెరపీ సెంటర్‌లో పనిచేసే రాజేష్‌తో స్వాతికి పరిచయమైన కొద్దిరోజుల్లోనే అతడితో ప్రేమలో పడింది. రాజేష్‌తో స్వాతికి వివాహేతర సంబందానికి దారితీసింది. రాజేష్‌తో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు పిల్లలు అడ్డుగా ఉండకూడదని స్వాతి పెద్ద ప్లాన్ వేసింది. తన వద్ద ఉన్న పిల్లలను తెలకపల్లి వద్ద ఉండే తన తల్లి వద్ద వదిలేసి వచ్చింది. తెలకపల్లిలోని స్కూల్‌లో పిల్లలు చదువుతున్నారు. జిల్లా కేంద్రాన్ని వదిలేసి మండలకేంద్రంలోని స్కూల్లో పిల్లలను చేర్పించింది.పిల్లలుంటే ప్రైవసీకి ఇబ్బంది కలుగుతోందని స్వాతి ప్లాన్ చేసిందని పోలీసులు చెబుతున్నారు.

పరువు కోసం తలను గోడకేసి గుద్దుకొన్న సుధాకర్ రెడ్డి
సుధాకర్‌రెడ్డికి భార్య స్వాతి వ్యవహరం ఎట్టకేలకు తెలిసిపోయింది. స్నేహితుడి ద్వారా వచ్చిన సమాచారం మేరకు స్వాతి ప్రవర్తనపై సుధాకర్‌రెడ్డికి అనుమానం వచ్చింది. ఈ విషయమై స్వాతిని సుధాకర్ రెడ్డి నిలదీశారు.ప్రేమించి వివాహం చేసుకొన్న భార్య ఈ రకంగా ప్రవర్తించడంపై సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు.సుధాకర్‌రెడ్డితో స్వాతి గొడవపడింది. స్వాతి వ్యవహరించిన తీరుతో మనస్థాపానికి గురైన సుధాకర్ రెడ్డి తలను గోడకేసి గుద్దుకొన్నాడు. దీంతో ఆయన తలకు గాయమైంది. దీంతో నాగర్‌కర్నూల్ పట్టణంలోనే ఉండే తన బంధువు సహయంతో ఆసుపత్రికి వెళ్ళి కుట్లు వేయించుకొని వచ్చాడు. చనిపోవడానికి ముందు రోజే ఈ ఘటన చోటు చేసుకొంది.

రాజేష్‌కు ఫోన్, మొబైల్ గిఫ్ట్ ఇచ్చిన స్వాతి
రాజేష్‌తో పరిచయమైన తర్వాత స్వాతి అతడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఫిజియోథెరపీ సెంటర్‌కు వెళ్ళిన కొద్దిరోజుల్లోనే స్వాతికి రాజేష్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రాజేష్‌కు స్వాతి మొబైల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది. రెండో నెలలో స్వాతి మోటార్ బైక్‌ను కూడ గిఫ్ట్‌గా ఇచ్చింది.ప్రియుడిపై మోజుతో స్వాతి గిప్ట్‌గా ఇచ్చిందని విచారణలో పోలీసులు గుర్తించారు.

ఉద్యోగం నుండి తొలగించిన ఫిజియోథెరపీ యజమాని
స్వాతి పరిచయంతో రాజేష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అయితే ఈ విషయాన్ని పిజియోథెరపీ సెంటర్ యజమాని గుర్తించాడు. రాజేష్ ప్రవర్తనలో వచ్చిన మార్పును స్పష్టంగా గమనించాడు. దీంతో రాజేష్‌ను విధుల నుండి తప్పించాడు. స్వాతితో పరిచయమైన రెండు మాసాల్లోనే రాజేష్ తీరులో వచ్చిన మార్పుతో ఫిజియోథెరపీ సెంటర్ యజమాని విధుల నుండి తప్పించాడు.

సుధాకర్‌రెడ్డికి, స్వాతికి మధ్య గ్యాప్
కొన్నేళ్ళుగా సుధాకర్ రెడ్డి, స్వాతికి మధ్య గ్యాప్ ఉందనే విషయాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ గ్యాప్ కారణంగానే రాజేష్‌తో స్వాతి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసిందనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ రెడ్డి తనను పట్టించుకోవడం మానేశాడని స్వాతి మధనపడినట్టు పోలీసులు చెబుతున్నారు.

సుధాకర్ రెడ్డి ఆస్తులను దక్కించుకోవాలని
రాజేష్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయించడం ద్వారా సుధాకర్ రెడ్డి రూపం తీసుకురావాలని స్వాతి ప్లాన్ చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ వద్దని వారించినా ప్లాస్టిక్ సర్జరీ కావాలని స్వాతి పట్టుబడిన విషయాన్ని పోలీసులు ప్రస్తావిస్తున్నారు. రాజేష్ సుధాకర్ రెడ్డి స్థానానికి వస్తే సుధాకర్ రెడ్డి ఆస్తులు కూడ దక్కించుకొనే అవకాశం కూడ దక్కే అవకాశం కూడ లేకపోలేదని స్వాతి భావించిందని పోలీసుల విచారణలో తేలిందని సమాచారం.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications