ఆయనో దొంగ రెడ్డి: కోదండరాంపై నాయిని తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయనో దొంగ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు.
సోమవారం బాలానగర్ ఫ్లైఓవర్ పనుల శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో నాయిని మాట్లాడారు.

కాంగ్రెస్ నేతలతో కలిసి రాష్ట్ర అభివృద్ధిని, ప్రాజెక్టులను కోదండరాం అడ్డుకుంటున్నారని నాయిని ఆరోపించారు. కోదండరాం వెంట ప్రజలెవరూ లేరని, ఆయన ఎక్కడికి పోయినా ఛీ కొడుతున్నారని అన్నారు. రాజకీయ లబ్ధికోసం ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులు గుడ్డివారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం వారికి కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలంతా ప్రభుత్వం వెంటే ఉన్నారని, 2019 ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ నాయకత్వానికి తిరుగులేదని నాయిని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications