7వేలమంది పోలీసులతో నాకాబందీ: 8కేజీలో బంగారం లభ్యం(పిక్చర్స్)
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ ఎత్తున నాకాబందీ చేపట్టారు. 7వేల మంది సిబ్బంది ఆకస్మికంగా బుధవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో రోడ్లపైకి వచ్చి తనిఖీలు చేశారు.
మొత్తం 90 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బారికేడ్లను అడ్డంగా పెట్టుకుని రెండు గంటల పాటు సోదాలు చేపట్టారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తోపాటు అధికారులు ఈ తనిఖీల్లో భాగస్వాములయ్యారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీసీఎస్, ఎస్‌బీ, ఎస్‌ఓటీ అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఇటీవల జరుగుతున్న చోరీలు, అటెన్షన్ డైవర్షన్, చైన్ స్నాచింగ్‌లు అరికట్టేందుకు పోలీసులు ఒక్కసారిగా రహదారిపైకి వచ్చి అనుమానితుల కోసం గాలించారు. అదే విధంగా పలు షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్‌లలో డికాయ్ ఆపరేషన్‌లను కూడా నిర్వహించారు.
సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాదాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి వై జంక్షన్, బాలానగర్ ప్రాంతాల్లో పోలీసు చెకింగ్‌లను పరిశీలించడంతో పాటు ఆయన స్వయంగా పలు వాహనాలు, ఆర్టీసీ బస్సులను సోదాలు చేశారు.
కాగా, బాలానగర్‌లోని ఓ లాడ్జీలో వ్యాపారులు గోపాల్, జితేందర్ సింగ్ వద్ద 8.4కిలోల బంగారం లభించడంతో కలకలం రేగింది. ముంబై నుంచి నగరంలోని వ్యాపారులకు చూపించేందుకు దీన్ని తీసుకొచ్చినట్లు తెలిసింది. ఈ బంగారాన్ని కమిషనర్ పరిశీలించారు. ఆ బంగారానికి రశీదులున్నా.. పన్ను చెల్లింపు వివరాల కోసం ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు.

నాకాబందీ
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ ఎత్తున నాకాబందీ చేపట్టారు.

నాకాబందీ
7వేల మంది సిబ్బంది ఆకస్మికంగా బుధవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో రోడ్లపైకి వచ్చి తనిఖీలు చేశారు.

నాకాబందీ
మొత్తం 90 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బారికేడ్లను అడ్డంగా పెట్టుకుని రెండు గంటల పాటు సోదాలు చేపట్టారు.

నాకాబందీ
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తోపాటు అధికారులు ఈ తనిఖీల్లో భాగస్వాములయ్యారు.

నాకాబందీ
లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీసీఎస్, ఎస్‌బీ, ఎస్‌ఓటీ అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

నాకాబందీ
ఇటీవల జరుగుతున్న చోరీలు, అటెన్షన్ డైవర్షన్, చైన్ స్నాచింగ్‌లు అరికట్టేందుకు పోలీసులు ఒక్కసారిగా రహదారిపైకి వచ్చి అనుమానితుల కోసం గాలించారు.

నాకాబందీ
అదే విధంగా పలు షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్‌లలో డికాయ్ ఆపరేషన్‌లను కూడా నిర్వహించారు.

నాకాబందీ
సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాదాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి వై జంక్షన్, బాలానగర్ ప్రాంతాల్లో పోలీసు చెకింగ్‌లను పరిశీలించడంతో పాటు ఆయన స్వయంగా పలు వాహనాలు, ఆర్టీసీ బస్సులను సోదాలు చేశారు.

నాకాబందీ
ట్రిపుల్ రైడింగ్, పత్రాలు లేని వాహనదారులు పోలీసుల తనిఖీలను తప్పించుకుకేందుకు నానా అవస్థలు పడ్డారు.

నాకాబందీ
ఏకంగా డివైడర్‌లను జంప్ చేసి తనిఖీలను తప్పించుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.

నాకాబందీ
సరైన పత్రాలు లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులకు పోలీసులు చలానా రాశారు. కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications