అమెరికాలో.. తెలుగు వైద్యుడు అచ్యుతరెడ్డి దారుణహత్య

నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సైకియాట్రిక్(మనోరోగ) వైద్యుడు అచ్యుతరెడ్డి అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన తన సొంత క్లినిక్‌లోనే ఓ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురై మరణించారు.

Recommended Video

    Indian Doctor Achutha Reddy Lost Life In US అమెరికాలో తెలుగు వైద్యుడి దారుణహత్య | Oneindia Telugu

    హైదరాబాద్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సైకియాట్రిక్(మనోరోగ) వైద్యుడు అచ్యుతరెడ్డి అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు. అచ్యుతరెడ్డి కాన్సాస్ రాష్ట్రంలోని విచితలో హోలిస్టిక్ క్లినిక్‌ను నడుపుతున్నారు.

    ఆయన తన సొంత క్లినిక్‌లోనే ఓ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురై మరణించారు. ఈ ఘటన గత బుధవారం రాత్రి చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

    doctor-achyut-reddy

    అచ్యుతరెడ్డి ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి 1986లో వైద్యవిద్యను పూర్తిచేశారు. 1989 నుంచి విచితలో ప్రాక్టిస్ చేస్తున్నారు. అదేవిధంగా విచితలోనే హోలిస్టిక్ సైకియాట్రిక్ సర్వీస్‌ను ఆయన నడుపుతున్నారు.

    కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి క్లినిక్ కు వచ్చి డాక్టర్ అచ్యుతరెడ్డితో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఆ క్రమంలో ఒక్కసారిగా కత్తి తీసి పలుమార్లు ఆయన్ని పొడిచాడు. దీంతో డాక్టర్ అచ్యుతరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు.

    ఈ ఘటన జరిగిన కొద్ది సమయంలోనే నిందితుడిని స్థానిక కంట్రీ క్లబ్ వద్ద అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన వ్యక్తి గుర్తింపుతోపాటు నిందితుడు డాక్టర్ అచ్యుతరెడ్డితో ఏ విషయంలో వాగ్వాదం పెట్టుకున్నాడో తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+