ఆ జిల్లా ప్రజలకు బిగ్ అలర్ట్.. హెల్మెట్ లేకపోతే నో పెట్రోల్..
తెలంగాణలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. 2024 తో పోల్చితే 2025 లో రోడ్డు ప్రమాదాలు 5.6 శాతం పెరిగాయి. హెల్మెట్ సీటు బెల్టు ధరించకపోవడం, రాంగ్ రూట్ లో డ్రైవింగ్, నిద్రలేమి, అతివేగం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో నో హెల్మెట్.. నో పెట్రోల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు నల్గొండ జిల్లా అధికారులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో జనవరి 7 నుంచి నో హెల్మెట్.. నో పెట్రోల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. పెట్రోల్ బంక్ కు హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చిన వారికి పెట్రోల్ సరఫరా చేయవద్దని సూచించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని పలు పెట్రోల్ బంకులను పరిశీలించిన జిల్లా ఎస్పీ.. వాహనదారులకు సూచనలు చేశారు. హెల్మెట్ ధరిస్తేనే వాహనదారులకు భద్రత అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వినూత్నంగా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
*‘No Helmet – No Petrol’ Rule to Be Implemented from Tomorrow*
— Nalgonda District Police (@NalgondaCop) January 6, 2026
— *District SP Sharath Chandra Pawar, IPS*
As part of the National Road Safety Month celebrations, the ‘No Helmet – No Petrol’ rule will be strictly implemented across Nalgonda district from tomorrow (Wednesday),… pic.twitter.com/uzx7BoBJAW
మరోవైపు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని ప్రజల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు నల్గొండ జిల్లాలోని వేములపల్లి, మాడ్గుల పల్లి పోలీసులు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. మాడ్గుల పల్లి టోల్ గేట్ నుంచి వేముల పల్లి వరకు ఈ ర్యాలీ చేపట్టారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు పెట్రోల్ పోయొద్దని సిబ్బందికి సూచనలు చేశారు. ఈ మేరకు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడపాలని పేర్కొన్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications