మైనర్ బాలికపై అత్యాచారం.. నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు..

దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక వేధింపులు అధికమవుతూనే ఉన్నాయి. ఓ వైపు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నా కొంతమంది మానవ మృగాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. అభం శుభం తెలియని ఆ చిన్నారులను మొగ్గలోనే తుంచేస్తున్నారు కొందరు మృగాళ్లు. బాలబాలికల రక్షణకై కేంద్ర ప్రభుత్వం గతంలో పోక్సో చట్టం తీసుకొచ్చినా చిన్నారులపై లైంగిక వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా నల్గొండలోని పోక్సో కోర్టు మరో సంచలన తీర్పును వెల్లడించింది. ఒక బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇన్‌ ఛార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు.

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నల్గొండలోని పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జడ్జి రోజారమణి కీలక తీర్పును వెల్లడించారు. మహ్మద్‌ ఖయ్యూమ్‌ అనే వ్యక్తిపై 2021 లో తిప్పర్తి పీఎస్‌ లో పోక్సో కేసు నమోదైంది. 2021 నుంచి జిల్లా కోర్టులో వాదనలు కొనసాగాయి. తాజాగా నల్గొండ పోక్సో కోర్టు తుది తీర్పును వెల్లడించింది.

ఏం జరిగింది..?

నల్గొండ జిల్లా తిప్పర్తికి చెందిన షేక్ మహమ్మద్ ఖయ్యూమ్ అనే వ్యక్తి.. తిప్పర్తి మోడల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని వెంటబడి వేధించేవాడు. ప్రతిరోజు స్కూలుకు వెళ్లే సమయంలో ఆమె వెంటపడి ప్రేమించమని వేధించసాగాడు. అలాగే 2021 నవంబరు 3న స్కూలు అనంతరం బస్ స్టాప్ ఉన్న మైనర్ బాలికను షేక్ మహ్మద్ ఖయ్యూమ్ బలవంతంగా తన బండి ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అనంతరం ఒక పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఖయ్యూమ్ పై తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 డిసెంబర్ 5న పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మూడున్నరేళ్ల విచారణ అనంతరం POCSO న్యాయస్థానం ఇన్చార్జి జడ్జి రోజా రమణి తాజాగా తుది తీర్పు వెల్లడించారు. నిందితుడికి 51 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. దాంతో పాటు రూ. 85,000 జరిమానా కూడా విధించారు. అలాగే బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం ప్రకటించింది కోర్టు.

Nalgonda POCSO Court Delivers Landmark 51-Year Sentence in Minor Girl Rape Case

ఇటీవలి కాలంలో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పులను వెల్లడించిన విషయం తెలిసిందే. 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేయడమే.. దారుణంగా చిన్నారిని హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించింది నల్గొండ పోక్సో కోర్టు. అంతేకాకుండా రూ. లక్షా పది వేల రూపాయల జరిమానా కూడా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలగే బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించింది. నిందితుడు చెల్లించే జరిమానా కూడా బాధిత కుటుంబానికే ఇవ్వాలని కోర్టు తుది తీర్పు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+