సలహాదారుగా గాంధీ: హీరో బాలకృష్ణ కేసును లాగిన నమస్తే తెలంగాణ

హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కెపిసి గాంధీని నియమించుకున్న నేపథ్యంలో నమస్తే తెలంగాణ దినపత్రిక నందమూరి బాలకృష్ణ కాల్పుల కేసును ముందుకు తెచ్చింది. గతంలో సినీ హీరో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసును నీరుగార్చి కోర్టులో వీగిపోయేలా చేశారని అప్పటి ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తాయని నమస్తే తెలంగాణ రాసింది.

నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తాకథనం ప్రకారం - ఎన్నో సంచలనాత్మక కేసులు చేధించిన రాష్ట్ర ఎఫ్‌ఎస్‌ఎల్ బాలకృష్ణ కాల్పుల కేసులో అనేక తప్పులు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిపై బాలకృష్ణ కాల్పులు జరిగిన తర్వాత జరిగిన ఎఫ్‌ఎస్‌ఎల్ పంచనామా రిపోర్ట్‌లో అవకతవకలు జరిగినట్లు సమాచారం. తుపాకీ కాల్పుల కేసులో కాల్పులు జరిపిన వ్యక్తిపై బుల్లెట్ నుంచి వచ్చే గన్ పౌడర్ ఆనవాళ్లు ఉంటాయి. దీనిని జీఎస్‌ఆర్ (గన్ షాట్ రెసిడ్యూ) అంటారు. దీనిని పక్కాగా పరీక్షించాల్సి ఉంటుంది.

ఎఫ్‌ఎస్‌ఎల్ కీలక అధికారి ప్రమేయంతో ఏ వ్యక్తి చేతి నుంచి తీసిన జీఎస్‌ఆర్ అని స్పష్టంగా పంచనామాలో రాయలేదు. దీనితో కోర్టులో కేసు వీగిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం అయ్యిందని విమర్షలు వినిపించాయి. ఇలాంటి ఎఫ్‌ఎస్‌ఎల్‌లో అప్పుడు కీలక అధికారిగా పనిచేసిన గాంధీని ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం సలహాదారుడి నియమించుకోవడం వెనుక ఓటుకు నోటు కేసును నీరుగార్చేందుకే కుట్ర ఉందని విపక్షాలు నెత్తినోరుకొంటుకుంటున్నాయని నమస్తే తెలంగాణ దినపత్రిక వ్యాఖ్యానించింది.

Namasthe Telangana drags Balakrishna case in Gandhi appointment

సలహాదారుడు గతంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో కీలకాధికారిగా చక్రం తిప్పిన అధికారి కావడం గమనార్హం. ఈ ఎపిసోడ్‌తో ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఆధారాలు మాయం చేసే కుట్ర మొదలైందన్న అనుమానాలను తెలంగాణ ఫోరెన్సిక్ అధికారులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారంటూ నమస్తే తెలంగాణ వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు, బాబు వ్యవహారం కేసులో కీలకమైన ఆడియో, వీడియో టేపులు పరిశీలన, పరీక్షలు ఎఫ్‌ఎస్‌ఎల్‌లో జరుగుతున్నాయి.

నమస్తే తెలంగాణ ఇంకా ఇలా రాసింది - చంద్రబాబు కుట్రదారుడిగా తేలే ఇలాంటి సమయంలో గతంలో పనిచేసిన ఆయన్ను సలహాదారుడిగా నియమించుకోవడంపై ఇరు రాష్ర్టాల విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆధారాలను మాయం చేయడం లేదా తప్పుడు నివేదికలు రూపొందించేలా ప్రభావితంచేయగల వ్యక్తిని బాబు సలహాదారుడిగా నియమించుకోవడంపై సర్వత్రా విమర్షలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+