హరికృష్ణ ప్రాణం తీసిన వాటర్ బాటిల్! 14 అడుగుల మేర గాల్లోకి లేచిన కారు
Recommended Video

నల్గొండ: నందమూరి హరికృష్ణ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని, పల్టీలు కొట్టిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో హరికృష్ణ కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు కాగా, ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.

ఎలా ఢీకొట్టిందంటే
హరికృష్ణ నెల్లూరు వెళ్తుండగా, చెన్నై నుంచి హైదరాబాదుకు మరో కారు వస్తోంది. కారు ఎలా ఢీకొట్టిందో ఆయన వివరించారు. తాము ఐదుగురం కలిసి చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్నామని, తాను కారును డ్రైవ్ చేస్తున్నానని, ఉదయం ఆరు గంటల సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపారు.

గాల్లోకి లేచిన కారు
తాము 80 కిలో మీటర్ల వేగంతో వెళ్తున్నామని అతను చెప్పారు. ఆ సమయంలో తమకు ఎదురుగా హైదరాబాద్ నుంచి వస్తున్న కారు అదుపు తప్పి దాదాపు పద్నాలుగు అడుగుల మేర గాలిలోకి ఎగిరి, మా వైపు దూసుకు వచ్చిందని, అది గమనించి తాను తన కారును ఎడమ వైపుకు తిప్పానని చెప్పారు.

లేదంటే మా కారు పైన పడేది
తాను కారును తిప్పకుంటే హరికృష్ణ కారు తమ కారు మీద పడేదని అతను తెలిపారు. తాను ఎడమ వైపుకు కారును తిప్పడంతో మా కారులోని వారు క్షేమంగా ఉన్నారని, కుడివైపు కూర్చున్న వ్యక్తికి గాయాలయ్యాయని చెప్పారు. ఆ తర్వాత మేం లేచి చూసేసరికి నడి రోడ్డు మీద వెళ్తున్న వారు హరికృష్ణను గుర్తించి రోడ్డు పైకి తీసుకు వచ్చి పడుకోబెట్టారని చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.

కారు వేగంగా ఉంది
కారు దాదాపు 30 అడుగుల దూరంలో పడిందని చెప్పారు. కారు చాలా వేగంగా ఉందని, అక్కడకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి, అటు వైపు రోడ్డు నుంచి ఇటువైపు రోడ్డుకు పడ్డారని చెప్పారు. హరికృష్ణ వాహనం చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనాన్ని తాకి మరో కొన్ని అడుగుల దూరంలో పడింది. ఆ సమయంలో కారు వేగంగా ఉందని చెప్పారు. మరో వాహనంలోని వారంతా క్షేమంగా ఉన్నామని చెప్పారు. కాగా, హరికృష్ణ వెనుక వైపు తిరిగి వాటర్ బాటిల్ తీసుకునే ప్రయత్నం చేయగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications