Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి సుహాసిని..
సీఎం రేవంత్ రెడ్డిని నందమూరి హరికృష్ణ కూతురు, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసిని కలిశారు. సుహాసిని జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. సుహాసిని రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు దిపాదాస్ మున్షీ ఉన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సహాసిన్ రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయంశంగా మారింది.
కాంగ్రెస్ ఇంకా 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో సుహాసినికి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమని సుహాసిని తేల్చి చెప్పారు. సుహాసిని ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతోన్నారు. ఆమె తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. 2018లో సుహాసిని కూకట్ పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. తాజాగా అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాంగ్రెస్ చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ కీసరలోని ఓ ఫామ్ హౌస్ లో కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. కార్యకర్తలు సూచనల మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేతలు, కేశవరావు, కడియం శ్రీహరి హస్తం గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మరింత మంది ఎమ్మెల్యేలు కారు దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉంటుందని అంచనాతో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం తగ్గిపోతోంది. మరోవైపు బీఆర్ఎస్ కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఇబ్బందులు పడుతుంది.












Click it and Unblock the Notifications