తెలుగుదేశం పార్టీలోకి నందీశ్వర్ గౌడ్, రమణతో భేటీ: పఠాన్‌చెరు టిక్కెట్ ఖరారు!
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సోమవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణమను కలిశారు. ఆయన పఠాన్‌చెరు టిక్కెట్ ఆశీస్తున్నారు. ఇటీవల టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతిలో కూడా కలిశారు. ఈ సందర్భంగా నందీశ్వర్ గౌడ్ మాట్లాడారు.
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో బంధుత్వానికి తాను తెలుగుదేశం పార్టీలో చేరడానికి సంబంధం లేదని చెప్పారు. తాను గతంలో అమరావతికి వెళ్లి చంద్రబాబును కలిసింది వాస్తవమేనని చెప్పారు. అధిష్టానం ఆదేశానుసారం తాను పని చేస్తానని అన్నారు. కాగా, నందీశ్వర్ గౌడ్ ఈ నెల 19న టీడీపీలో చేరనున్నారు.

జగిత్యాలలోను తెరాసకు షాక్
జగిత్యాలలో తెరాసకు షాక్ తగిలింది. జగిత్యాల జెడ్పీటీసీ నాగలక్ష్మి, రాములు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీన్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. గత నెల సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ అదో రేజు 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో టిక్కెట్ రానివారు పార్టీలోకి మారుతున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలైన కొండా సురేఖ, బొడిగె శోభ, మేడ్చల్ నుంచి సుధీర్ రెడ్డిలకు తొలి జాబితాలో టిక్కెట్ దక్కలేదు. ఈ కారణంగా కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications