నాన్నకు ప్రేమతో: ఎన్టీఆర్ డైలాగులతో కేటీఆర్ (వీడియో)
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 99 సీట్లు సాధించి విపక్షాలను చిత్తు చేయడంలో కీలకపాత్ర పోషించిన కేటీఆర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంపై అభిమనులు ఇప్పటివరకు తమకు తోచిన విధంగా పోస్టర్లు చేసి ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేశాయి.
తాజాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలోని డైలాగులతో కేటీఆర్ నాన్నకు ప్రేమతో అంటూ ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నాయి. బల్దియా ఎన్నికల్లో కేటీఆర్ ఎంతగా తన ముద్రను వేశాడో సామాజిక మాధ్యమాల్లో చూస్తే అర్ధమవుతుంది.
రాజకీయాల్లో కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ దొరికాడంటూ తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాన్నకు ప్రేమతో సినిమాలోని డైలాగులతో రూపొందించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. టీఆర్ఎస్ అభిమానులు ఈ వీడియోతో తమ అభిమానాన్ని చాటడంతోపాటు తమ క్రియేటివిటీని చాటుకున్నారు.

కాగా, ఎన్నికలకు ముందు చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం పంచాయతీరాజ్, ఐటిశాఖలకు మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు మున్సిల్ శాఖ అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా దానిని నెరవేరుస్తానన్నారు.
మున్సిపల్ శాఖను నాకు అదనంగా కేటాయించారని చెప్పిన కేటీఆర్, దీంతో నా బాధ్యత మరింత పెరిగిందన్నారు. మున్సిపల్ శాఖలో పలు కీలక సంస్కరణలు తీసుకొస్తామని ఆయన చెప్పారు. తాను ఏ పదవి కోసం తాపత్రయ పడబోనని, టీఆర్‌ఎ్‌లో ఒక కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు.
అంకిత భావంతో పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి టెక్నాలజీని ఉపయోగిస్తామని చెప్పారు. ముఖ్యంగా వాట్సప్ ద్వారా నేరుగా ప్రజలతో టచలో ఉంటామని కేటీఆర్ వివరించారు. ఏ కాలనీలో ఏ సమస్య ఉన్నా వాట్స్‌పలో సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.

పాలనలో ప్రజల్ని భాగస్వామ్ం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో కాలనీ సంఘాలను ఏకం చేసి వారి నుంచి నెయిబర్‌హుడ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో కొత్తగా ఏర్పడే పాలక మండలి ద్వారా కీలక నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్టు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications