నారా లోకేష్‌కు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్, థ్యాంక్స్ చెప్పారు
హైదరాబాద్: రోడ్ల పైన రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌ను పరీక్షించారు. లోకేష్ కారులో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 నుండి ఇంటికి వెళ్తున్నారు.
ఆ సమయంలో పెద్దమ్మ గుడి వద్ద రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఆయన కారును ఆపారు. ఆ సమయంలో డ్రైవింగ్ సీటులో లోకేష్ ఉన్నాడు.

ఆయనను చూసిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వెంటనే లోకేష్ కిందకు దిగి బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్ష చేసుకోమని చెప్పారు. దాంతో పోలీసులు ఆయనను పరీక్షించారు. ఆయన తాగనట్లుగా తేలింది. అనంతరం పోలీసులు నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నేత రేవంత్ రెడ్డిని కూడా టెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications