షాకింగ్!: హరీష్ రావుపై నారా లోకేష్ ప్రశంసలు, కెసిఆర్‌పై కిషన్ ఫైర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పైన తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ప్రశంసలు కురిపించారా? అంటే అవునని తెలుస్తోంది. తెలంగాణలో టిడిపి వర్సెస్ టిఆర్ఎస్‌గా ఉన్న విషయం తెలిసిందే.

అలాంటిది టిఆర్ఎస్ నేత అయిన హరీష్ రావు పైన టిడిపి యువనేత నారా లోకేష్ ప్రశంసలు కురిపించారని తెలుస్తోంది. హరీష్ రావు నిజమైన మాస్ లీడర్ అని లోకేష్ కితాబిచ్చారు. నిత్యం జనాల్లో తిరుగుతూ, వారితో మమేకమైన ఉండే హరీష్ రావు విధానం తనకు బాగా నచ్చుతుందని చెప్పారు.

 Nara Lokesh praises Harish Rao

విమోచన దినంగా జరపండి: కిషన్ రెడ్డి

సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినంగా జరపాలని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గురువారం అన్నారు. విమోచన దినంగా జరపకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అవమానిస్తున్నారన్నారు.

విమోచన దింగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినంగా జరిపితే ముస్లింలు బాధపడతారనడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని జరపాలని కేసీఆర్ ఎందుకు డిమాండ్ చేశారో చెప్పాలన్నారు.

ప్రధాని మోడీపై గుత్తా ఆగ్రహం

ప్రధాని మోడీ పైన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశీ పర్యటనలు మినహా ఏం చేయలేదన్నారు. కాంగ్రెస్ ఎంపీల నియోజకవర్గాల్లో బిజెపి కేంద్రమంత్రుల పర్యటన హాస్యాస్పదమన్నారు. అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు తమ పైన విమర్శలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+