సిసలైన హైదరాబాదీని, షహర్ హమారా - హైదరాబాద్ హమారా: నారా లోకేష్
హైదరాబాద్: షహర్ హమారా... హైదరాబాద్ హమారా... అనే నినాదంతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్న్ికల్లో మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చి పెట్టిన ఘనత తమ పార్టీదేనని ఆయన అన్నారు.
శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో గ్రేటర్ టిడిపి అధ్యక్షుడు, శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అధ్యక్షతన జరిగిన గ్రేటర్ అసెంబ్లీ ఇంచార్జీలు, డివిజన్ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో లోకేష్ మాట్లాడారు ఈ నెల 22వ తేదీన గ్ర్టేటర్‌లోని 150 డివిజన్లలో జరిగే జెండా పండుగతో ఎన్నికలకు ఊపు తీసుకు రావాలని ఆయన సూచించారు.

తాను అసలు సిసలైన హైదరాబాదీని అని ఆయన చెప్పుకున్నారు. తాను హైదరాబాదులో పుట్టి పెరిగానని, తన తండ్రి రాయలసీమకు చెందినవారైతే, తల్లి ఆంధ్ర ప్రాంతానికి చెందినవారనని అన్నారు. గతంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పారిపోయిందని వ్యాఖ్యానించారు .
ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోటీ చేయడానికి టిఆర్ఎస్ ఉత్సాహపడుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పెద్ద యెత్తున ఓటర్ల పేర్లను తొలగించడం వెనక దాగి ఉన్న టిఆర్ఎస్ కుట్రలను కేందర్ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. బిజెపితో పొత్తు పెట్టుకుని జిహెచ్ఎంసి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోగలిగామని నారా లోకేష్ చెప్పారు.












Click it and Unblock the Notifications