నారాయణ ఐఐటి క్యాంపస్ విద్యార్థి ఆత్మహత్య: వేధింపులే కారణమా?
నల్లగొండ: నారాయణ కాలేజీ విద్యార్థి ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లగొండకు చెందిన విద్యార్థి మెదక్ జిల్లా రామచంద్రాపురంలోని ఐఐటి క్యాంపస్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
బుధవారం సాయంత్రం అతను హాస్టల్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ వేధింపులే అతని ఆత్మహత్యకు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనకు ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

హైదరాబాద్ పాతబస్తీలోని హుక్కా సెంటర్లపై పోలీసులు కొరడా ఝళిపించారు. గురువారం పాతబస్తీలో ఉన్న పలు హుక్కాసెంటర్లపై దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా 15 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications