నారాయణ ఓటు తొలగించలేదు, నెంబర్ ఇదే: జిహెచ్ఎంసి
హైదరాబాద్: సిపిఐ నేత నారాయణ ఓటును తొలగించారన్న వార్తల్లో నిజం లేదని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) అధికారులు తెలిపారు. ఆయన ఓటును తొలగించలేదని స్పష్టం చేశారు.
నారాయణ ఓటర్ ఐడీకార్డు నంబర్ కేజీవై 4591947గా తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయనకు ఓటు ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.

సీపీఐ సీనియర్ నేత నారాయణ, ఆయన సతీమణి వసుమతి ఓట్లను సర్వే అధికారులు తొలగించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బషీర్‌బాగ్‌లోని బిఎన్‌రెడ్డి టవర్స్ ఫ్లాట్ నెం.104లో నారాయణ నివాసం ఉంటున్నారు. ఓటరు జాబితాలో తనపేరు లేకపోవడాన్ని చూసి నారాయణ ఆశ్చర్యానికి గురయ్యారని వార్తలు వచ్చాయి.
దీనిపై నారాయణ స్పందిస్తూ - ఓట్ల తొలగింపులో అక్రమాలు జరుగుతున్నాయనడానికి తన ఓటు తొలగింపే నిదర్శనమన్నారు. దీనిపై జిహెచ్‌ఎంసి అధికారులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications