తెలంగాణలో మరో పోరుకు రెఢీ: ఫిబ్రవరి 13న నారాయణఖేడ్ ఉప ఎన్నిక

హైదరాబాద్: నారాయణఖేడ్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు మంగళవారం నాడు షెడ్యూల్ విడుదలయింది. నారాయణఖేడ్‌తో పాటు దేశవ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఖేడ్ ఉప ఎన్నిక ఫిబ్రవరి 13వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపు 16వ తేదీన ఉంటుంది.

జనవరి 20వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. 27వ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జనవరి 30వ తేదీన నామినేషన్‌ల ఉపసంహరణకు చివరి తేదీ. కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి నేపథ్యంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

Narayankhed by-elections schedule released

జిహెచ్ఎంసి ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

జిహెచ్ఎంసి ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ మంగళవారం నాడు ప్రారంభమైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 150 వార్డులకు ఫిబ్రవరి 2న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

నామినేషన్ల దాఖలుకు ఈనెల 17 మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంది. 18న రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్‌ పత్రాలను పరిశీలిస్తారు. నామినేషన్లను ఉపసహంరించుకునేందుకు 21న అవకాశం కల్పిస్తారు. ఫిబ్రవరి 5న మేయర్‌ ఎన్నికల లెక్కింపు చేపట్టి గెలిచిన వారిని ప్రకటిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+