ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ పెళ్ళి హడావిడి.!నరేష్ పవిత్ర యాక్షన్ ఓకే.!క్రిటిక్స్ దే కాస్త ఓవరాక్షన్.!
హైదరాబాద్ : నటుడు నరేష్ మూడు సార్లు పెళ్లి చేసుకుంటే లేని రచ్చ నాల్గవ సారి మాత్రం వివాదమవుతోంది. వాస్తవాలను ఆవిష్కరించిన మళ్లీ పెళ్లి చిత్రంలో నరేష్, పవిత్రల అంశంలో సినిమా క్రిటిక్స్ విమర్శలకు కాస్త ఎక్కువగానే పదునుపెట్టినట్టు తెలుస్తోంది. నరేష్ నాల్గో పెళ్లి చేసుకున్నాడని నచ్చలేదా లేక పవిత్ర రెండో పెళ్లి చేసుకుందని నచ్చట్లేదా అర్ధం కాని పరిస్ధితి. ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోకుండానే కలిసి సహా జీవనం సర్వ సాధారణం కాదా? మరి చట్టబద్దంగా చేసుకుంటే దాన్ని ఇంత విమర్శించడం వెనకున్న మర్మం ఏమిటో ప్రస్తుతం వేలెత్తి చూపుతున్న వారు చెప్పాలి.
సినిమాను సినిమాలాగే చూస్తే ఏ ఇబ్బంది ఉండదు : ఆడవారి డైనమిక్ నిర్ణయాల వలన పితృస్వామ్య వ్యవస్థ లో భూకంపం సంభవించిందని అర్థం చేసుకోవాలి. ఆడవారి జీవితంలో భర్తతో విభేదఇంచి విడాకులు తీసుకుంటే సమాజం వ్యవహరించే తీరు మగవాడు భార్యను విడిచి పెట్టినప్పుడు వ్యవహరించే తీరులో ఉన్న తేడాను కూడా గుర్తించి విశదీకరిస్తే ఆమోదయోగ్యంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య రిలేషన్ ఉండాల లేదా అనేది మగవాడి నిర్ణయించాలి తప్ప ఆడవాళ్ళు కోరుకుంటే విడాకులు మంజూరు కావు అని అందరికీ తెలిసిన విషయమే.















Click it and Unblock the Notifications