సినిమా షూటింగ్ వాహనం ఢీ: మాజీ మంత్రి పొన్నాలకు తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పొన్నాల ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన సినిమా షూటింగ్ వాహనం ఢీకొట్టింది. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 45 సిగ్నల్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న పొన్నాల లక్ష్మయ్య, ఆయన మనవడు సురక్షితంగా బయటపడ్డారు. కాగా, ప్రమాదంలో పొన్నాల కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఓంకార్ అనే సినిమా ఔట్‌డోర్ యూనిట్‌కు సంబంధించిన వాహనం పొన్నాల కారును ఢీకొట్టింది.

కాగా, ఈ ఏడాది ఆగస్టులో పొన్నాల లక్ష్మయ్య సోదరి మనవడు కోడూరి ధపత్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌పై వేగంగా వెళ్తున్న అతడు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

narrow escape for ponnala lakshmaiah from road accident in jubilee hills

పాఠం చెబుతూనే ప్రాణాలు కోల్పోయిన టీచర్

మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెబుతూనే ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలకట్టే ఎస్సీకాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పాఠశఆల ప్రధానోపాధ్యాయుడు విజయ్ సింగ్ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు తరగతి గదికి వెళ్లారు. విద్యార్థులకు పాఠాలు చెబుతుండగానే కుప్పకూలిపోయాడు. హెచ్ఎం అలా పడిపోవడంతో ఆందోళన చెందిన విద్యార్థులు.. ఇతర ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసేసరికి ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని టీచర్లు విజయ్ సింగ్ కుటుంబసభ్యులకు తెలియజేశారు. గుండెపోటు రావడం వల్లే ఆయన హఠన్మరణం చెందినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+