హోటల్ మేనేజ్మెంట్ లో ఆన్ లైన్ శిక్షణ, ఉద్యోగాలు- అర్హతలు..!!
ఉపాధి.. ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారికి నేషనల్ స్కిల్ అకాడమీ బిగ్ అప్డేట్. హోటల్ మేనేజ్మెంట్, క్లౌడ్ కిచెన్ & క్యాటరింగ్ సర్వీసెస్ కోర్సుల్లో శిక్షణ ద్వారా ఉద్యోగాల పైన కీలక ప్రకటన చేసింది. స్వయం ఉపాధి ద్వారా భవిష్యత్ నిర్మించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటి వరకు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ లో శిక్షణ ఇచ్చిన ఈ సంస్థ ఇప్పుడు కొత్తగా హోటల్ రంగంలో
మహిళలు, యువతీ యువకుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
నేషనల్ స్కిల్ అకాడమీ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ & క్యాటరింగ్ సర్వీసెస్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో మహిళలకు, యువతీ యువకులకు హోటల్ మేనేజ్మెంట్, క్లౌడ్ కిచెన్, క్యాటరింగ్ సర్వీసెస్ లో ఆన్లైన్ /ఆఫ్లైన్ శిక్షణ ఇవ్వనుంది. శిక్షణతో పాటుగా స్వయం ఉపాధి తో పాటు ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు అర్హత ఆసక్తి గల మహిళలు, యువతీ యువకుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించింది. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చేసిన మహిళలు, యువతీ యువకులు ఈ శిక్షణ కు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసారు. మాస్టర్ చెఫ్, క్యాటరింగ్ సర్వీస్, క్లౌడ్ కిచెన్ సర్వీస్, క్లౌడ్ బేకరీ సర్వీస్, క్లౌడ్ బేవరేజ్ సర్వీస్, టీ-మాస్టర్, టిఫిన్-మాస్టర్, పిజ్జా-మాస్టర్, కేటరింగ్ మాస్టర్, చైనీస్ ఫుడ్ మాస్టర్, తో పాటు హోటల్ మేనేజ్మెంట్, హౌస్ కీపింగ్ సర్వీస్ వంటి వాటిల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

శిక్షణ - ఉపాధి అవకాశాలు
అదే విధంగా ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్, బేవరేజ్ సర్వీస్, చైనీస్ ఫుడ్ మాస్టర్ వంటి కోర్సుల్లో ఆన్లైన్ / ఆఫ్ లైన్ శిక్షణ తో పాటు ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన వారికి పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆమోదిత సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. శిక్షణ పొందిన మహిళ లు, యువతీ యువకులు ఇంటి వద్దనుండి క్లౌడ్ కిచెన్ లో బిజినెస్ ని మొదలు పెట్టే అవకాశం హాస్పిటాలిటీ రంగంలో ఉద్యోగాలు పొందవచ్చు. హైదరాబాద్ లో ఇంటర్న్షిప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కలవు. అర్హత ఆసక్తి గల మహిళలు, యువతీ యువకులు పూర్తి వివరాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.nationalskillacademy.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.












Click it and Unblock the Notifications