బ్లూ ఫిలింల కేసులో కళ్యాణ్ జైలుకెళ్లొచ్చారు, ముగ్గురు హీరోయిన్లతో లింకు: నట్టికుమార్
హైదరాబాద్: బ్లూ ఫిలింల కేసులో జైలుకెళ్లి వచ్చిన చరిత్ర సి. కళ్యాణ్‌ది అంటూ నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. గ్యాంగ్ స్టర్ నయీంతో టాలీవుడ్ నిర్మాతలకు లింకులున్నాయంటూ నిర్మాత నట్టికుమర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ అసభ్య పదజాలంతో నట్టికుమార్‌పై ధ్వజమెత్తారు.
దీంతో సి. కళ్యాణ్ వ్యాఖ్యలపై నట్టికుమార్ కూడా వేగంగానే స్పందించారు. శుక్రవారం మధ్యాహ్నాం మీడియాతో మాట్లాడిన నట్టి కుమార్ ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన సి.కల్యాణ్ అనతి కాలంలోనే కోట్లు ఎలా సంపాదించాడు? ఆ వ్యవహారమంతా బయటపెట్టాలని నట్టికుమార్ ప్రశ్నించారు.
బ్లూఫిలింకేసులో జైలుకెళ్లిన చరిత్ర మరిచారా? దొంగతనాలతోనే సి. కళ్యాణ్ ఎదిగాడంటూ ఆయన ఆరోపించారు. ముగ్గురు హీరోయిన్లతో కల్యాణ్‌కు సంబంధాలున్నాయని నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాలో నాపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. వ్యక్తిగతంగా సి. కళ్యాణ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమని నట్టికుమార్ సవాల్ విసిరాడు.

సి. కళ్యాణ్‌పై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానంటూ ఆయన తేల్చిచెప్పారు. నానక్‌రాంగూడలో సి. కళ్యాణ్ భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పిన నట్టికుమార్ తానెక్కడా ఏసుప్రభువు పేరుతో డబ్బు వసూలు చేయలేదని చెప్పుకోచ్చారు. ఏ విచారణకైనా తాను సిద్ధమని నట్టికుమార్ చెప్పారు.
నయీం కేసులో ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఐదారు రోజుల్లో అన్ని వాస్తవాలు బయటపడతాయని ఆయన అన్నారు. తనపై భౌతిక దాడులు చేస్తానని కళ్యాణ్ బెదిరిస్తున్నాడని చెప్పారు. అయితే తాను మాత్రం చావుకైనా సిద్ధమేనని కూడా ఆయన చెప్పారు.
నిర్మాత సి. కళ్యాణ్ శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ అతనో పిచ్చికుక్క అన్నారు. నట్టి కుమార్.. నోరి జారితే చెప్పు తెగుద్ది అని దుయ్యబట్టారు. ఏసుక్రీస్తు పేరు చెప్పుకొని డబ్బులు దండుకుంటున్నాడన్నారు. నట్టి బాధితులు చాలామంది ఉన్నారని, అతని బాధితుల కోసం ఓ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. నట్టిది బ్లాక్ మెయిలింగ్ చరిత్ర అన్నారు.
అతనిని వెంటనే అదుపులోకి తీసుకొని.. అతని వద్ద నయీంతో సంబంధాలున్న ఆధారాలను తీసుకోవాలన్నారు. నట్టి కుమార్‌తో పాటు ఆయన కుటుంబసభ్యుల పైనా సి కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం టాలీవుడ్‌కు చెందిన పలువురు నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి నట్టికుమార్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications