చార్మిపై ఏం చేద్దాం?: డిజిపితో అకున్, ప్రశ్నలతో నవదీప్ ఉక్కిరిబిక్కిరి
ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అకున్ సబర్వాల్ సోమవారం సాయంత్రం డిజిపి అనురాగ్ శర్మను కలిశారు. డ్రగ్ కేసు అంశంపై కలిశారు.
హైదరాబాద్: ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అకున్ సబర్వాల్ సోమవారం సాయంత్రం డిజిపి అనురాగ్ శర్మను కలిశారు. డ్రగ్ కేసు అంశంపై కలిశారు.
తనపై వచ్చిన ఆరోపణలపై డిజిపికి వివరణ ఇచ్చారు. పారదర్శకంగా విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు సహజమేనని, వాటిని పట్టించుకోవద్దని, డిపార్టుమెంట్ మీకు అండగా ఉంటుందని అకున్ సబర్వాల్‌కు డిజిపి భరోసా ఇచ్చారు.
చదవండి: చార్మీ సహా అందరికీ అకున్ గట్టి జవాబు, అందుకే సినీ స్టార్స్ పేర్లు!

చార్మీపై ఏం చేద్దాం?
నటి చార్మి హైకోర్టును ఆశ్రయించడం, అకుల్ సబర్వాల్‌కు బెదిరింపు ఫోన్లు రావడం, డ్రగ్ కేసు విచారణ నేపథ్యంలో ఆయన డిజిపిని కలిశారు. చార్మి హైకోర్టును ఆశ్రయించినందున ఏం చేద్దామనే అంశంపై వారి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది.

చార్మి ఇలా..
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి చార్మి సోమవారం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మహిళ కావడంతో ఆమె ఎక్కడ కోరుకుంటే అక్కడే విచారణ జరుపుతామని అధికారులు స్పష్టంచేయగా.. తాను సిట్ కార్యాలయానికే వస్తానని చార్మి వారికి తెలిపారు. ఎల్లుండి విచారణ జరగనున్న నేపథ్యంలో ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ విచారణ తీరు బాగాలేదని, వారి విచారణపై తనకు అనుమానాలున్నాయని, విచారణకు వచ్చిన వారి నుంచి రక్తం, వెంట్రుకటు, గోళ్లు బలవంతంగా సేకరిస్తున్నారన్నారు. అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని చార్మి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణకు కుటుంబ సభ్యులను అనుమతించరు కాబట్టి తనతో పాటు లాయర్‌ను అనుమతించేలని కోరారు.

నవదీప్ విచారణలో తెరపైకి టింకు పేరు.. ఉక్కిరి బిక్కిరి
నటుడు నవదీప్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నప్పుడు కొత్తగా తెరపైకి టింకు పేరు వచ్చింది. డ్రగ్స్ వ్యవహారంపై నవదీప్ చాలా సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. సిట్ ప్రశ్నలతో నవదీప్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడని సమాచారం. నవదీప్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమందికి నోటీసులు ఇవ్వనున్నారు.

మారుపేర్లతో వ్యవహారం
డ్రగ్స్ వ్యాపారానికి పాల్పడే వాళ్లు మారు పేర్లతో వ్యవహారం నడుపుతారని విచారణలో నవదీప్ వెల్లడించాడని సమాచారం. చాటింగ్ కూడా నిక్ నేమ్స్‌తోనే జరుపుతారని వెల్లడించాడని తెలుస్తోంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications