నయీమ్ చేతిలో శాటిలైట్ ఫోన్స్: 15 మంది లేడీ షార్ప్ షూటర్లు
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీం వద్ద శాటిలైట్ ఫోన్ కూడా ఉందనే విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం. దాంతో అతని శాటిలైట్ ఫోన్ ఎలా వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. ఓ ఐపిఎస్ అధికారి నయీంతో రెగ్యులర్ టచ్‌లో ఉన్నాడని తెలుస్తోంది.
నయీం ఫ్రెండ్స్ లిస్ట్‌లో పోలీస్ ఆఫీసర్స్ ఉన్నట్లు కూడా గుర్తించారు. అతనికి సహకరించినవారిపై చర్యలకు కూడా రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నయీం సెటిల్మెంట్లకు, భూదందాలకు, బెదిరింపులకు, హత్యలకు సంబంధించిన ఆధారాలను సేకరించిన అధికారులు అతని వద్ద శాటిలైట్ ఫోన్ ఉన్నట్లు కూడా గుర్తించారు. సంభాషణలు ట్రాకింగ్ కాకుండా అతను శాటిలైట్ ఫోన్ వాడేవాడని చెబుతున్నారు.

నయీంకు వ్యతిరేకంగా ఎక్కడ ఫిర్యాదు వచ్చినా ఓ ఐపిఎస్ అధికారి ప్రవేశించి చక్కదిద్దేవాడని ప్రచారం సాగుతోంది. నయీం సహకారంతో అతను ఎన్‌కౌంటర్లు చేసి, యాక్సిలరీ ప్రమోషన్ కూడా కొట్టేసినట్లు చెబుతున్నారు. పటోళ్ల గోవర్దన్ రెడ్డి హత్య తర్వాత తలెత్తిన వివాదాన్ని కూడా అతనే పరిష్కరించాడని ప్రచారం సాగుతోంది..
నయీం స్వయంగా షార్ప్ షూటర్ అని తెలుస్తోంది. రెండు చేతుల్తో రెండు పిస్టళ్లు పట్టుకొని గురితప్పకుండా కాల్చగలగే నైపుణ్యం ఉందని భావిస్తున్నారు ఫైరింగ్ లో తనకున్న అనుభవంతో రక్షణ దళానికి శిక్షణ ఇచ్చినట్లు భావిస్తున్నారు తన రక్షణ కోసం నియమించుకున్న మహిళలను కూడా షార్ప్ షూటర్లను చేసినట్లు చెబుతున్నారు.
దాదాపు 15మంది మహిళలను నయీం కొనుగోలు చేసి తన వ్యక్తిగత సైన్యంగా తయారు చేసుకున్నాడు. ఇలా నయీం వద్దకు చేరిన మహిళలు అందరి చేతా షూటింగ్ ప్రాక్టీస్ చేయించాడని సమాచారం. నయీంకు కుడిభుజంలా వ్యవహరించే మాజీ నక్సలైట్ రియాజుద్దీన్‌ను పోలీసులు నల్లగొండలో పట్టుకున్నారు.
నయీం తరఫున రియాజ్ సుపారి హత్యలు చేస్తూంటాడు. రియాజ్ కూడా షార్ప్ షూటర్. నయీం దగ్గరున్న మహిళలను షార్ప్‌షూటర్లను చేయడంలో రియాజ్ సహకరించాడని చెబుతారు. నయీం ముఠాకు కావాల్సిన ఆయుధాల సేకరణ రియాజే చేసేవాడని అంటారు. నార్సింగ్ లోని ఇంటిలో అరెస్టు చేసిన షార్ప్ షూటర్లు ఫరానా, అఫ్సా నయీంకు సంబంధించిన విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లకు నిరంతరం రక్షణగా ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
చాలా మంది మహిళలను నయీం తన అవసరాలకోసం, రక్షణ కోసం వినియోగించుకునేవాడని తెలుస్తోంది. అందుకు మిర్యాలగూడను అడ్డగా చేసుకుని యువతులను రప్పించునేవాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మిర్యాలగూడలోని నయీం అత్త సుల్తానాబేగం కుటుంబం ఇందులో కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.
పదేళ్ళ కాలంలో మిర్యాలగూడ నుంచే 15మంది వరకు యువతులను నయీం ఇంట్లో పని కోసమని పంపినట్లు గుర్తించారు. మొదట్లో ఇంటి పని ఆ తర్వాత ఇతర అవసరాల కోసం నయీం వీరిని వాడుకునే వాడని అంటారు. ఆ తర్వాత వారిని ఇతరులకు అప్పజెప్పేవాడని తెలుస్తుంది. మహిళల అక్రమ రవాణాలో నయీం హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, హవాలా దందా కూడా నయీం కొనసాగించాడా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications