నయీం డైరీలోని కోడ్ పేర్లు ఇవీ: ఎవరీ చింటూ సార్, టెర్రర్ బాస్
హైదరాబాద్: ఇద్దరు వ్యక్తులతో గ్యాంగస్టర్ నయీం అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు అతని డైరీలను బట్టి తెలుస్తోంది. అతడి డెన్స్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీల్లోని, పుస్తకాల్లోని వివరాలను విశ్లేషించే పనిలో దర్యాప్తు అధికారులు పడ్డారు. కోడ్ రూపంలో పదాలు, పేర్లు లెక్కకు మిక్కిలి బయటకు వస్తున్నాయి. వాటిని డీకోడ్ చేయడంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు.
నయీం ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో ఎక్కువగా ఇద్దరి పేర్ల ప్రస్తావన ఉంది. పలు సందర్భాలను వివరిస్తూ అతను చింటు సార్, టెర్రర్ బాస్ అని రాసుకున్నట్లు తెలుస్తోంది. వారిద్దరు పోలీసు అధికారులే అయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఇద్దరిలో టెర్రర్ బాస్ కన్నా చింటు సార్‍తోన నయీం ఎక్కువ సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది.

చింటు సార్‌కు విలువైన బహుమతులు ఇచ్చినట్లు అతను డైరీలో రాసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసు, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో సంబంధాలను నెరిపిన నయీం ప్రతి ఒక్కరికీ ఒక్కో మారు పేరు పెట్టుకున్నాడు. వారికి తాను ఎలా ఉపయోగపడింది, వారిని తాను ఎలా వాడుకుందీ డైరీలో వివవరించారు.
పుప్పాలగుడా అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీం బెడ్రూం నుంచి పోలీసులు కీలకమైన డైరీతో పాటు ఆల్బమ్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నయీంతో సంబంధాలు పెట్టుకుని ప్రయోజనం పొందినవారిని గుర్తించే పనిలో దర్యాప్తు అధికారులు ఉన్నారు. నయీం వెనక ఉన్న షాడోలను గుర్తించేందుకు పోలీసు విభాగం లొంగుబాట్లపై దృష్టి పెట్టింది.












Click it and Unblock the Notifications