వీరికి నయీంతో భూదందాల లింక్స్: వారి బినామీలు ఎవరు, ఎంతెంత?
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీంతో సంబంధాలు పెట్టుకుని భూదందాలు చేసిన నాయకులు, అధికారుల మెడలకు ఉచ్చు బిగిస్తోంది. తాజాగా, కొంత మంది పేర్లు బయటకు వచ్చాయి. నయీంతో సంబంధాలు పెట్టుకుని భూదందాలు నడిపిన వారి పేర్లు కొన్ని తాజాగా వెలుగు చూశాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ ఇంట్లో 15 ఏళ్లుగా పనిచేస్తున్న నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెర్కుపల్లికి చెందిన పర్సబోయిన నాగయ్య పేరు మీద భువనగిరి ప్రాంతంలో పది ఎకరాల భూమి ఉందని గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అతన్ని ఆగస్టు 23వ తేదీన విచారించింది.
విద్యాసాగర్‌కు వరుసకు కుమారుడైన రవీందర్ రెడ్డి తనను భువనగిరికి తీసుకుని వెళ్లి 2008లో తనకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని బొమ్యాయిప్లలిలో తన పేరు మీద పది ఎకరాల భూమిని రిజిస్టర్ చేయించారని, సమయం వచ్చినప్పుడు భూమిని తమ పేరు మీద బదలాయించుకుంటామని చెప్పారని అతను తన వాంగ్మూలంలో చెప్పాడు.

తాను ఆ భూమి ఎవరిది, ఎక్కడ ఉందని అనే విషయాలను తాను అడగలేదని, తమ సార్ సంతకం పెట్టాలని చెప్తే పెట్టానని అతను చెప్పాడు. నయీంతో భూదందాలు నెరిపిన వారి వివరాలు, వారి బినామీలు....
* నేతి విద్యాసాగర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్
బినామీ: గంగస్వామి రవీందర్ రెడ్డి (నేతి విద్యాసాగర రావు సమీప బంధువు - ఈయన పేరు మీద బొమ్మాయిపల్లిలో 10 ఎకరాలు
బినామీ: నాగయ్య (విద్యాసాగర్ ఇంట్లో వంట మనిషి), ఈయన పేరు మీద బొమ్మాయిపల్లిలో మరో పది ఎకరాలు
* సాయిమనోహర్, డిఎస్పీ
బినామీ: కొత్తూరు వెంకట్రామయ్య, వరంగల్ - ఇతని పేరు మీద భువనగిరిలో ఎకరం భూమి.
బినామీ: తీగల శోభన్ రావు, భువనగిరిలో రెండు ఎకరాలు
* వెంకటయ్య, సిఐ కల్వకుర్తి
బినామీ: మల్లికార్జున్, భువనగిరిలో ఇతని పేరు మీద ఎకరం భూమి
* మద్దిపాటి శ్రీనివాస్, ఎఎస్పీ
బినామీ: నాగేంద్ర ప్రసాద్, ఇతని పేరు భువనగిరిలో విలువైన భూమి
* బూర రాజగోపాల్, ఖమ్మం ఎస్సై
బినామీ: నర్సింహస్వామి (బావమరిది), భువనగిరిలో ఎకరం భూమి
* మస్తాన్ వలీ, సంగారెడ్డి ట్రాఫిక్ సిఐ
బినామీ: యూసుఫ్ ఖాన్ (మస్తాన్ వలీ మామ), ఇతని పేరు మీద బొమ్మాయిపల్లిలో ఎకరం భూమి
* చింతల వెంకటేశ్వర రెడ్డి, టిఆర్ఎ్ నేత
బినామీ: బీరం మధుకర్ రెడ్డి, బిల్డర్. ఇతని పేరు మీద బొమ్మాయిపల్లిలో పది ఎకరాలు
* మలినేని శ్రీనివాస రావు, పోలీసు అధికారి
బినామీ: వెలగపూడి శివరాం ప్రసాద్, భువనగిరిలో విలువైన భూమి












Click it and Unblock the Notifications