షాక్.. 1 కాదు సీక్రెట్ రూంలో 10 డైరీల్లో చిట్టా: నయీం బాధితుల్లో 20మంది నేతలు
హైదరాబాద్: తవ్వేకొద్దీ గ్యాంగ్ స్టర్ నయీం గురించి షాకింగ్ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. నయీంకు చెందిన ఒక డైరీ వెలుగు చూస్తేనే ఎన్నో సంచలనాలు బయటకు వచ్చాయి. కానీ నయీం వస్తే తప్ప తెరవని గదిని బుధవారం తెరిచిన అధికారులకు 10 డైరీలు స్వాధీనం చేసుకున్నారు.
కోర్టు అనుమతితో తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు, అధికారులు సోదాలు నిర్వహిస్తన్నారు. ఎన్‌కౌంటర్‌కు ముందు నయీం శాటిలైట్ ఫోన్ వినియోగించినట్లు అధారాలు లభ్యమయ్యాయి. శాటిలైట్ ఫోన్ వాడకం కలకలం రేపుతోంది.

నయీం బాధితుల చిట్టా పెద్దదే
నయీం దోస్తానా చేసిన వారి జాబితాలో చాలామంది ఐపీఎస్ అధికారులున్నారన్న వార్తలు వెలువడిన వెంటనే అతడి బెదిరింపులకు గురైన వారి జాబితా కూడా వెలుగులోకి వచ్చింది. బెదిరింపులు, భూకబ్జాలు, సెటిల్మెంట్లతో నయా గ్యాంగ్ స్టర్‌గా అవతారమెత్తిన నయీం... ఇప్పటిదాకా 20 మంది దాకా ప్రజా ప్రతినిధులను బెదిరించాడని తెలుస్తోంది.
రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన 200 మంది బడా వ్యాపారులకు కూడా నయీం నుంచి బెదిరింపులు ఎదురయ్యాయని పోలీసుల విచారణలో తేలింది. నయీం నుంచి బెదిరింపులు ఎదుర్కొన్న బాధితులలో తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువు కూడా ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
దిమ్మతిరిగే ఆస్తుల చిట్టా
నయీం కూడబెట్టిన ఆస్తుల చిట్టా చూస్తుంటే పోలీసులకే దిమ్మ తిరుగుతోంది. హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో వందలాది ఎకరాల భూములను కబ్జా చేసిన అతడు భారీ నేర సామ్రాజ్యాన్నే స్థాపించాడు.
హైదరాబాదులోని అలకాపురిలోని అతడి ఇంటిలోనే రూ.2 వేల కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయని తెలుస్తోంది. నల్గొండలో వందలాది ఎకరాలు కొన్న విషయం తెలిసిందే. మొత్తం రెండువేలకు పైగా ఎకరాల భూమిని కబ్జా చేశాడు. నయీం ఆస్తుల విలువ ఇప్పటికే నాలుగువేల కోట్లకు పైగా తేలిందని సమాచారం.
యాదాద్రి పైన కన్ను
యాదాద్రి (యాదగిరిగుట్ట) అభివృద్ధి నేపథ్యంలో నయీం దాని పైన కన్నేసినట్లుగా తెలుస్తోంది. యాదాద్రిని తిరుపతి తరహాలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ అభివృద్ధిని కూడా సొమ్ము చేసుకోవాలని నయీం భావించాడని తెలుస్తోంది. కాగా, నయీం గతంలో ఓ ప్రజాప్రతినిధిని బెదిరించి రూ.50 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.త












Click it and Unblock the Notifications