ఎన్ కౌంటరయ్యే ముందు.. అనుచరున్ని హత్య చేసిన నయీమ్
షాద్ నగర్ : నయీమ్.. నయీమ్.. ప్రస్తుతం ఏ నోటా విన్న ఇదే చర్చ. నక్సలైట్ నుంచి గ్యాంగ్ స్టర్ వరకు నయీమ్ కొనసాగించిన ప్రస్తానంలో ఎన్నెన్నో నేరాలు. ఆఖరికి అతను ఎన్ కౌంటర్ అవడానికి కొద్ది గంటల ముందు కూడా ఓ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

తన అనుచరుల్లో ఒకడైన వాజిద్ అనే యువకుడిని ఆదివారం నాడు నయీమ్ హత్య చేసినట్లుగా సమాచారం. ఆదివారం నాడు రాత్రి షాద్ నగర్ చేరుకోవడం కంటే ముందు.. మెదక్ జిల్లా జహీరాబాద్ లో తన అనుచరుడైన వాజిద్ ను నయీమ్ హత్య చేశాడు.
అనంతరం అక్కడి నుంచి పరారై నేరుగా షాద్ నగర్ చేరుకున్నాడు. షాద్ నగర్ లోని ఓ భవనంలో తలదాచుకున్న నయీమ్ వెంట ఓ మహిళ, ఇద్దరు అనుచరులు జహీర్ బాద్ నుంచి తనతో పాటే వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications